
కీర్తి సురేష్ ఫస్ట్ డోస్ కరోనాను కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంది. 'నా కర్తవ్యం నిర్వర్తించాను' అంటూ వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోని కీర్తిసురేష్ తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. మరోసారి అలా.. గతంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో 'జెర్సీ' మూవీ చేసిన నాని.. మరోసారి అదే ఫార్మాట్ రీపీట్ చేయబోతున్నారట. ''శ్యామ్ సింగరాయ్, టక్ జగదీష్'' సినిమాల తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్టులో నాని ఫుట్‌బాల్ ఆటగాడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న కొత్త చిత్రానికి సంబంధించి ఓ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ానికి పెద్ద పీట వేశారని, చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారని సమాచారం. మరోసారి అనిల్‌తో సంగీత అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఫన్ రైడ్ F3లో సీనియర్ హీరోయిన్ సంగీత భాగం కాబోతోందట. ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఆమె కోసం ఓ స్పెషల్ రోల్ రాసి కాంటాక్ట్ చేశారట అనిల్ రావిపూడి. మహేష్ సరసన స్టార్ హీరోయిన్ డాటర్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు.. ఆ వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు మహేష్ కూడా ఓకే చెప్పారని టాక్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vhgI1s
No comments:
Post a Comment