హీరో రాజశేఖర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై రాజశేఖర్ కారు బోల్తా పడింది. శంషాబాద్ దగ్గరలోని పెద్ద గోల్కండ దగ్గర అదుపు తప్పిన కారు బోల్తా పడింది. రాజశేఖర్ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. టీఎస్ 07 ఎఫ్‌జెడ్ 1234 నెంబరు కలిగిన లగ్జరీ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తరువాత మరో కారులో రాజశేఖర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే గరుడవేగ సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ తరువాత కల్కితోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. గతంలో వరస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న రాజశేఖర్ ఇప్పుడు కథ ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇటీల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల్లో రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Qg9h8L
No comments:
Post a Comment