ప్రస్తుతం వి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ తదుపరి చేయబోయే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. గతంలో నాని హీరోగా నిను కోరి సినిమాను తెరకెక్కించిన దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు నాని. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయిన ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడిగా నటించనుంది. నాని కెరీర్‌ను ములపు తిప్పిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నాని, రీతూలు కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు జోడి కడుతుండటం ఆసక్తికరంగా మారింది. Also Read: నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా మజిలీ లాంటి సూపర్‌హిట్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్ నెలలో సినిమా లాంఛనంగా ప్రారంభించి జనవరిలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `వి` సినిమాలో నటిస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా నాని ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత శివ నిర్మాణ సినిమా పనులు ప్రారంభించనున్నాడు. Also Read: ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బాద్‌షా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన రీతూవర్మ ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకొని హీరోయిన్‌గా సెటిల్ అయిపోయింది. పెళ్లి చూపులు తరువాత తెలుగులో ఒక్కే కేశవ సినిమా మాత్రమేచేసిన ఈ భామ మూడేళ్ల తరువాత తిరిగి తెలుగు సినిమాకు అంగీకరించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OU1hIq
No comments:
Post a Comment