అభిమాని మరణాన్ని తట్టుకోలేకపోయారు ప్రముఖ తమిళ నటుడు కార్తి. చెన్నైకు చెందిన వ్యసాయ్ నిత్య అనే అభిమాని ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం అతను చనిపోయాడు. ఈ విషయం తెలీడంతో హుటాహుటిన అభిమాని స్వస్థలమైన ఉళుండూరుపేటకు బయలుదేరారు. అయితే అభిమాని మృతదేహాన్ని చూసి కార్తి ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వ్యసాయ్‌కి కార్తి అంటే ఎంతో అభిమానం. కార్తి ఫ్యాన్స్ అసోసియేషన్ అయిన మక్కల్ నాల మండ్రం పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. వ్యసాయ్ అంటే కార్తికి చాలా ఇష్టం. అలాంటి అభిమానిని కోల్పోవడంతో కార్తి తట్టుకోలేకపోయారు. వ్యసాయ్ కుటుంబీకులను కార్తి పరామర్శించారు. ఏ సాయం కావాలన్నా తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఉళుండూరుపేట నుంచి కార్తి నేరుగా తాను నటించిన ‘తంబి’ సినిమా ఆడియో లాంచ్‌కు వెళ్లారు. ఆయన స్టేజ్‌పైకి ఎక్కగానే చనిపోయిన తన అభిమాని గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. అందరూ నిమిషం పాటు మౌనం వహించాలని కోరారు. కార్తికి తన అభిమానులంటే ఎంతో ఇష్టం. వారి ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు అప్పుడప్పుడూ వెళుతుంటారు. ఎప్పటినుంచో తెలిసిన అభిమానిని కోల్పోవడంతో కార్తి కన్నీరుమున్నీరయ్యారు. ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న కార్తి ప్రస్తుతం ‘తంబి’ సినిమాతో బిజీగా ఉన్నారు. తొలిసారి ఈ సినిమాలో తన వదిన జ్యోతికతో కలిసి నటించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.s
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L5AR5e
No comments:
Post a Comment