బాలీవుడ్ హీరో తన సినిమాలు కలెక్షన్లతో ఎంత ఫేమసో.. కేసులు వివాదాలతోనూ అంతే ఫేమస్. ముఖ్యంగా కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అంతేకాదు సల్మాన్ నిర్మాతగా తన బావమరిది ఆయుష్ శర్మ హీరోగా తెరకెక్కిన లవ్‌యాత్రి సినిమా కూడా సల్మాన్‌ను ఇబ్బందుల పాలు చేసింది. ఈ సినిమాకు ముందుగా లవ్‌రాత్రి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఆ టైటిల్ `నవరాత్రి`లా ఉందని కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కోర్టులో కేసుకు కూడా వేశాయి. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా సల్మాన్‌కు ఇబ్బందులు మాత్రం ఏడాది పాటు కొనసాగాయి. ఏడాది కాలంగా కొనసాగుతున్న ఈ కేసులో సల్మాన్‌కు ఊరట లభించింది. Also Read: సల్మాన్ తరుపున కోర్టుకు హాజరైన లాయర్ మాట్లాడుతూ `ఒకసారి సెన్సార్ సర్టిఫికేట్ జారీ అయిన తరువాత ఆ సినిమాను ఎక్కడైన ప్రదర్శించే హక్కు నిర్మాతకు ఉంటుంది. ఆ నిబంధనల ప్రకారం సల్మాన్ సినిమాను రిలీజ్ చేశార`ని తెలిపాడు. ఈ వాదనతో ఏకీభివించిన న్యాయస్థానం సల్మాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం.. సల్మాన్ ప్రస్తుతం సూపర్ హిట్ దబాండ్ సిరీస్‌లో మూడో భాగంగా వస్తున్న దబాంగ్ 3 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ నటుడు సుధీప్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాను హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PauoaL
No comments:
Post a Comment