`ఖాళీగా ఇంట్లో కూర్చుంటా.. కానీ ఆ సినిమాలు చేయను`

హీరోగా స్టార్‌ ఇమేజ్‌ కోసం కష్టపడుతున్న యంగ్ హీరో . తనని తాను ప్రూవ్‌ చేసుకునేందుకు ఇటీవల నిర్మాతగా కూడా మారిన ఈ యంగ్ హీరో త్వరలో సినిమాలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కామెడీ చిత్రాల స్పెషలిస్ట్‌ జీ నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సందీప్‌ మీడియాలో మాట్లాడాడు. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌ కథ విషయానికి వస్తే కర్నూల్‌ టౌన్‌లో చిన్న చిన్న కేసులు వాదించే లాయర్‌ రామకృష్ణ. చిన్న కేసు తీసుకొని గెలవాలి అన్నది రామకృష్ణ కొరిక. అయితే అలాంటి లాయర్‌కు ఓ పెద్ద కేసు వస్తుంది. ఆ కేసును ఆ లాయర్‌ ఎలా డీల్‌ చేశాడు. ఆ ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అన్న విషయాన్ని హిలేరియస్‌గా తెరకెక్కించారు. Also Read: ఈ సందర్భంగా సందీప్‌ మాట్లాడుతూ. `ఇటీవల థ్రిల్లర్‌, యాక్షన్‌ సినిమాలు చేశా.. చాలా కాలం తరువాత మంచి కామెడీ సినిమా చేశా. రాజసింహా ఇచ్చిన కథకు నాగేశ్వర రెడ్డి లాంటి మంచి దర్శకుడు దొరకటం అదృష్టం. ఆ కామెడీ స్టైల్‌ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. హీరోయిన్‌ హన్సికది కూడా చాలా మంచి పాత్ర. నేను రిస్కీ షాట్స్‌ చేయడానికి పెద్దగా భయపడకపోయినా గ్లాస్‌ బ్లాస్టింగ్, బైక్‌ రేసింగ్‌ లాంటివి మాత్రం కాస్త కష్టమే. ఈ సినిమాలో గ్లాస్‌ బ్లాస్టింగ్ సీన్‌ ఒకటి ఉంది, ఆ సీన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. అద్దం పగిలి నా కంటి కింద గుచ్చుకుంది. కానీ కంటికి ఏం కాలేదు. Also Read: నేను కాజల్, తమన్నాల లాగా మెథడ్‌ యాక్టర్‌ని కాను. నాకు స్పాంటేనియస్‌గా నటించటమే వచ్చు. క్యారెక్టర్‌ కోసం ప్రిపేర్‌ అవ్వటం నాకు రాదు. కథలో కామెడీ ఉండాలిగానీ.. కామెడీ కోసం కథ తయారు చేస్తే అది వర్క్‌ అవుట్‌ కాదు. థ్రిల్లర్‌ జానర్‌లో నేను నిర్మించిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమా విడుదల చేయడానికి కష్టాలు పడినా నిర్మాతగా ఆ సినిమాతో చాలా హ్యాపీగా ఉన్నా. నా నిర్మాణ సంస్థని కంటిన్యూ చేస్తా. ఈ మధ్యే ఓ మంచి కథ విన్నా. ఆ ప్రాజెక్ట్‌ రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా చేద్దామనుకుంటున్నా. ప్రస్తుతం హాకీ నేపథ్యంలో ‘ఎ1 ఎక్స్‌ప్రెస్‌’ సినిమా చేస్తున్నా. Also Read: దాని కోసం ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను. రెండేళ్లుగా నేను న్యూ ఏజ్‌ స్టోరీస్‌, ఇంటెన్స్‌ ఉన్న కథల వెంటపడి గాడి తప్పాను. మధ్యలో రీమేక్‌లు చేద్దామనీ ప్రయత్నించాను. ఇప్పుడు కథల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నా. మంచి కథ లేకపోతే ఇంట్లో ఖాళీగా కూర్చుంటాను కానీ ఫ్లాప్‌ కథల జోలికి మాత్రం వెళ్లను. ‘ప్రస్థానం 2’ చేయాలనే ఐడియా లేదు. కానీ దేవ కట్టాతో ఓ సినిమా చేస్తా` అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Qd7z8n

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts