మహేష్ బాబు- రాజమౌళి క్రేజీ కాంబోలో బాలకృష్ణ.. జక్కన్న స్కెచ్ ఇదే!

ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మహేష్ బాబు- క్రేజీ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో నందమూరి నటసింహం భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు రీసెంట్‌గా బాలయ్య బాబుకు కబురుపెట్టి ఈ సినిమా కోసం ఆయన నుంచి రాజమౌళి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు సమాచారం. RRR పనులతో బిజీగా ఉంటూనే తన తదుపరి ప్రాజెక్టుపై కసరత్తులు చేస్తున్న రాజమౌళి.. ఇప్పటికే బౌండెడ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేసుకొని ఈ సినిమాలో మహేష్‌తో పాటు బాలకృష్ణను భాగం చేయాలని ప్లాన్ చేసుకున్నారట. ఈ మేరకు బాలయ్య బాబు డేట్స్ కూడా తీసుకున్నారని టాక్. ఇకపోతే రాజమౌళి చేపట్టబోతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో బాలకృష్ణ కీ రోల్‌ చేయనున్నారని, దాదాపు 20 నిమిషాలకు పైగా బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందని తెలుస్తోంది. కథను టర్న్‌ చేసే రోల్ బాలయ్య పోషించబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ వైరల్ అవుతుండటంతో మహేష్ బాబు- బాలకృష్ణలను ఒకే తెరపై చూసే అరుదైన అవకాశం పట్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి మహేష్ బాబు- రాజమౌళి కాంబోపై పడింది. పైగా జక్కన్న సైతం ఈ మార్చి నెలాఖరులో RRR రీలీస్ చేసి ఫ్రీ కాబోతున్నారు. ఇకపై ఆయన సమయం మొత్తం తదుపరి ప్రాజెక్టుపైనే పెట్టనున్నారట. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ప్రస్తుతం ఈ కథను సానబెట్టే పనిలో ఉన్నారట. సో.. చూడాలి మరి ఈ భారీ సినిమాలో బాలకృష్ణ భాగమవుతారా? లేక ఇది రూమరేనా అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/b0f5wIU

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts