నందమూరి బాలకృష్ణ- కాంబినేషన్‌లో వచ్చిన '' సినిమా ఇద్దరికీ కలిపి హాట్రిక్ హిట్ ఇచ్చింది. కరోనా పరిస్థితుల్లోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి ఘన విజయం సాధించింది. వసూళ్ల పరంగా చూస్తే కెరీర్ లోనే భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈ రోజుల్లో కూడా థియేటర్‌లో 100 రోజులు ఆడిన సినిమాగా అరుదైన ఫీట్ సాధించింది. దీంతో ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్న 'అఖండ' టీమ్ కర్నూల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించారు. నందమూరి అభిమానుల కోలాహలం నడుమ నడిచిన ఈ కృతజ్ఞత సభలో అఖండ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేసిన కామెంట్స్ బాలయ్య ఫ్యాన్స్ చేత కేకలు పెట్టించాయి. బాలయ్య బాబుతో తన జర్నీ గుర్తు చేసుకుంటూ అఖండ మూవీ కష్టాలను వివరించారు బోయపాటి. ఈ మేరకు బాలకృష్ణపై, ఆయన పడిన కష్టంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఎమోషనల్ అయ్యారు. అఖండ గురించి ఒకే ఒక్క మాట అంటూ ఈ చిత్రాన్ని బాలయ్య అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా ఆదరించారు కాబట్టే ఇంత పెద్ద సక్సెస్ సాధించిందని తెలిపారు బోయపాటి. బాలయ్య బాబుకు ఆయన ఫ్యాన్స్ అంటే చాలా అభిమానమని, అందుకే ఎంతో బిజీ షెడ్యూల్‌లో కూడా హుటాహుటిన ఈ కృతజ్ఞత సభకు విచ్చేసి మనందరి కోసం సమయం కేటాయించారని అన్నారు. కెరీర్ పరంగా తనకు బాలయ్యతో మూడో సినిమా చేసే ఛాన్స్ దక్కిందని, అలా ప్రయోగాత్మకంగా `సింహ` సినిమా చేయడంతో అది ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుందని బోయపాటి అన్నారు. ఆ చిత్రంతోనే తన తొలి అడుగు పడిందని పేర్కొన్న బోయపాటి.. `లెజెండ్` మూవీతో రెండో అడుగు, `అఖండ` సినిమాతో మూడో అడుగు పడిందని చెప్పారు. ఈ మూడు సినిమాలతో బాలయ్య ఫ్యాన్స్ తనను వారి ఫ్యామిలీ మెంబర్‌ని చేసుకున్నారని బోయపాటి అన్నారు. బాలకృష్ణకు అభిమానులే పెద్ద బలం అని, ఆ బలం ఎంత పెద్దదంటే 'చరిత్ర సృష్టించాలన్నా మీరే, దాన్ని తిరగరాయాలన్నా మీరే' అని చెబుతూ వేదిక ప్రాంగణాన్ని హూషారెత్తించారు బోయపాటి. అఖండ సినిమాలోని అఘోరా క్యారెక్టర్ కోసం తెర వెనుక బాలయ్య బాబు పడిన కష్టాన్ని మాటల్లో వర్ణించలేమని ఆయన అన్నారు. బాలయ్య బాబుతో తన జర్నీ జీవితాంతం ఇంతే సక్సెస్‌ఫుల్‌గా సాగాలని కోరుకుంటున్న బోయపాటి.. బాలయ్య గారు ఒక పురాణ పురుషుడు. నటనా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనే కాదు, సేవా రంగంలోనూ ఆయన ముందుకెళ్తున్న తీరు అభినందనీయం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/OS4eZcF
No comments:
Post a Comment