‘రాధేశ్యామ్’ రిలీజ్‌తో నేషనల్ స్టార్ పేరు మారుమోగుతోంది. ఈ సినిమా రిజల్ట్‌పై మిక్స్ టాక్ ఉన్నప్పటికీ.. ప్రత్యేకించి ఓ వర్గం అయితే ఎప్పటిలాగే సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నెగిటివ్ పాజిటివ్‌లు ఎప్పుడూ ఉండేవే కానీ.. అంతిమ నిర్ణయం మాత్రం ప్రేక్షకుడిదే. అతను హిట్ అంటే హిట్.. ఫట్ అంటే ఫట్.. మధ్యలో ఈ సోషల్ మీడియా పేపర్ పులులు హిట్‌ని ఫ్లాప్ అని.. ఫ్లాప్‌ని హిట్ అని ప్రచారం చేసినా పోయిందేమీ ఉండదు. పొగిడేవాళ్లు పొగుడుతుంటారు.. తిట్టేవాళ్లు తిడుతుంటారు.. ప్రతి రిలీజ్ సినిమాకి ఇలాంటి తిప్పలు తప్పవు కానీ.. తాజాగా రాధాశ్యామ్ సినిమాపైన హీరో ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించింది . తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ప్రభాస్ వ్యక్తిత్వంపై పొగడ్తల వర్షం కురిపించింది.. ‘‘స్టార్స్ చాలామంది ఉన్నారు.. యాక్టర్స్ చాలామంది ఉన్నారు.. కానీ మన ఇండియాలో మనుషుల్ని నమ్మి.. ఐదు సంవత్సరాలు ఒకే ఒక్క మూవీకి.. అది కూడా ప్రైమ్ టైంలో కేటాయించడం అనేది చాలా గ్రేట్. ఆయన లుక్స్ గురించి కాదు.. క్రేజ్ గురించి కాదు.. వ్యక్తిత్వం గురించి.. నమ్మని వాళ్లకోసం నిలబడటమే ఆ క్యారెక్టర్. బాహుబలి అన్ని రికార్డుల్ని బ్రేక్ చేసింది.. తెలుగు సినిమా కీర్తి ప్రతిష్ఠల్ని ప్రపంచానికి తెలిసేట్టు చేసింది.. మోడీ గారు కూడా మన తెలుగు సినిమా గురించి చెప్తూ బాహుబలి గురించి మాట్లాడారు. రాధేశ్యామ్ గురించి చెప్పాలంటే.. నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఇండియన్ లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టపడతా.. రాధేశ్యామ్ కూడా మంచి లవ్ స్టోరీ కావడంతో ఐ లైక్ ఇట్. ట్రైలర్‌లో ఆయన కుర్చీలో కూర్చుని చెప్పిన డైలాగ్ నాకు బాగా నచ్చింది. నిర్మాత బాగు కోసం ఇంతలా ప్రమోషన్స్ చేసే హీరోని ప్రభాస్‌నే చూస్తున్నా. ఇన్ని కోట్లు బడ్జెట్ వద్దని ప్రొడ్యుసర్స్‌కి చెప్పాను.. మేకింగ్ కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టారు.. నెక్స్ట్ టైం ఇలా చేయొద్దని చెప్పాను.. వాళ్ల కోసం మనస్పూర్తిగా వచ్చి ప్రమోషన్స్ చేస్తున్నా.. అని ప్రమోషన్స్‌లో చెప్తున్నారు ప్రభాస్.. ఏ హీరో కూడా ఇలా చెప్పలేదు. ప్రభాస్, పూనమ్ కౌర్‌ని ఒకే స్క్రీన్‌పై చూడొచ్చా అంటే.. ఓం నమశివాయ!! ఇలా జరగాలని కోరుకోండి.. ఎందుకు జరగకూడదు.. జరగొచ్చు.. నా కోసం ప్రేయర్ చేయండి.. ప్రభాస్ పక్కన చేయడాన్ని చాలా ఇష్టపడతాను’ అంటూ చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/n9sYkml
No comments:
Post a Comment