నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో చెమటోడుస్తుంది సమంత. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కుర్ర హీరోయిన్స్‌కు కూడా షాకులిచ్చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే సమంత వరుస పోస్ట్‌లను చేస్తూ వస్తుంది. సాధారణంగానే కాకుండా హాట్ డ్రెస్సులతో అదరగొట్టేస్తోంది. రీసెంట్‌గా రెడ్ డ్రెస్సులో సమంత హాటు ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేసిన సంగతి తెలిసిదే. ఇదంతా చూసిన కొందరు దీని వెనుక సమంతకు బలమైన కారణముందని అంటున్నారు. అసలు సమంత డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్‌తో, హాట్ లుక్స్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేస్తూ రావడాన్ని గమనించిన కొందరు దీన్ని రివేంజ్ డ్రెస్సింగ్ అంటారని అంటున్నారు. లవ్ బ్రేకప్, భర్త నుంచి విడిపోయిన తర్వాత సదరు మగవాడు అసూయ ఫీలయ్యేలా.. తాను ఏం కోల్పోయానో తెలియజేసేలా అమ్మాయి అలా డ్రెస్సింగ్ చేసుకుంటారని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. 1994లో ప్రిన్స్ ఛార్లెస్‌తో డయానా విడిపోయిన తర్వాత క్రిస్టినా స్టాంబోలినా అనే గ్రీక్ డిజైనర్ డిజైన్ చేసిన బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. అప్పట్లో ఆ డ్రెస్సింగ్ స్టైల్ హాట్ టాపిక్‌గా మారింది. మీడియా కూడా బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన అమ్మాయి డ్రెస్సింగ్ కూడా అప్పట్లో ప్రత్యేక కథనాలను కూడా రాసింది. ఇప్పుడదే పంథాను సమంత కూడా ఫాలో అవుతుందని అలాంటి రివేంజ్‌లో భాగమే ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అని కొందరు అంటుంటే, ఆమె తను సినిమాల్లో నటించడానికి రెడీ అనే సందేశాన్ని మేకర్స్‌కు ఇలా తెలిజయేస్తుందని కొందరు అంటున్నారు. సినిమాల విషయానికి వస్తే.. ఆమె రెండు ద్వి భాషా చిత్రాల్లో నటించబోతున్నట్లు ప్రకటించారు. అందులో ఒకటి తమిళ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌లో ఎస్.ఆర్.ప్రకాశ్, ఎస్.ఆర్.ప్రభులతో కలిసి శాంత రూబన్ జ్ఞానశేఖరన్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించనున్నారు. మరో చిత్రాన్ని హరి, హరీష్ అనే ఇద్దరు డెబ్యూ డైరెక్టర్స్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ చిత్రంలో సమంత ఓ స్పెషల్ కూడా చేస్తున్నారు. ఇది కాకుండా బాలీవుడ్‌లో మంచి కథ వస్తే తప్పకుండా సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నానని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలోనూ సమంత తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CR0wH0
No comments:
Post a Comment