సినీ నటిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన .. బుల్లితెరపై చాలా పెద్ద స్టార్ అయ్యింది. బుల్లితెర షోలకు గ్లామర్ ట్రీట్ అద్దిన యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ముందు వరుసలో ఉంది. అయితే కేవలం టీవీకే పరిమితమైపోకుండా ఈ అమ్మడు అడపా దడపా సినిమాల్లోనూ నటిస్తూ వస్తుంది. తాజా సమాచారం మేరకు రష్మీ గౌతమ్‌కు మరో గోల్డెన్ ఆఫర్ దక్కింది. మెగాస్టార్ హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భోళా శంకర్‌లో రష్మీ గౌతమ్ నటించనుందని టాక్. ప్రత్యేకమైన సెట్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీని తర్వాత ఓ సాంగ్ చిత్రీకరించనున్నారు. ఈ సాంగ్‌లో రష్మీ గౌతమ్ నటిస్తుందని సమాచారం. సినిమాల్లో నటించడం రష్మీ గౌతమ్‌కి కొత్తేమీ కాకపోయినా, మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందనడంలో సందేహం లేదు. తమిళ చిత్రం ‘వేదాళం’కు ఇది రీమేక్. అజిత్ చేసిన పాత్రను చిరంజీవి చేస్తున్నారు. ఇందులోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం చిరంజీవి గుండు లుక్‌లో కనిపించబోతున్నారు. చిరంజీవి గుండు లుక్ టెస్ట్ ఎప్పుడో చేశారు. అప్పట్లో చిరంజీవి గుండు లుక్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్రలో మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ కనిపించనుంది. కోల్‌కతా సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే చిత్రమిది. విలన్స్ బారి నుంచి తన చెల్లెల్ని కాపాడుకోవడానికి హీరో ఏం చేశాడనేదే ప్రధాన కథాంశం. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని రూపొందిస్తుున్నారు. ఇప్పటికే చిరంజీవి ఆచార్య సినిమాను పూర్తి చేసేశారు. అది ఫిబ్రవరి 4న విడుదలవుతుంది. ఇప్పుడు మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ గాడ్‌ఫాదర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఇందులో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు. నయనతార, సత్యదేవ్ ఇలా మంచి స్టార్ క్యాస్టింగ్‌తోనే సినిమా తెరకెక్కుతోంది. ఇవన్నీ కాకుండా బాబీ డైరెక్షన్‌లో మరో సినిమాను చిరంజీవి స్టార్ట్ చేశారు. అసలు కుర్ర హీరోలు సైతం ఆలోచించని స్పీడుతో చిరంజీవి దూసుకెళ్తున్నారు. వచ్చే ఏడాది అనుకున్నట్లు జరిగితే మూడు సినిమాలతో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DRSHCg
No comments:
Post a Comment