బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌పై ముంబైలోని సబ్ అర్బన్ ఖాన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి చెందిను సిక్కు గురు ద్వారా మేనేజ్‌మెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె సిక్కులపై తన సోషల్ మీడియా మాధ్యమంలో అభ్యంతర కరంగా మాట్లాడారంటూ తెలిపారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌కు చెందిన రైతులు ఉద్యమంలో పాల్గొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన కంగనా రనౌత్ దీన్ని ఓ ఖలీస్థానీ ఉద్యమం అని, రైతులను ఉగ్రవాదులని కామెంట్స్ చేయడం తగదని, ఆమె కామెంట్స్ జాతి విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని సదరు కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ఇందిరా గాంధీపై, నాటి సికకు అల్లర్లపై కూడా కంగనా రనౌత్ కామెంట్స్ చేశారని సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలే ముంబై రాష్ట్ర ప్రభుత్వం కంగనా రనౌత్‌కు వ్యతిరేకం ఇది వరకే ఆమెకు వ్యతిరేకంగా వారు బి.ఎం.సి ద్వారా పెద్ద గొడవే చేశారు. ఇప్పుడు ఈ కంప్లైంట్‌తో వారెలా రియక్ట్ అవుతారో చూడాలి. రీసెంట్‌గా ప్రధాని నరేంద్ర మోడి రైతు చట్టాల్లో మూడింటిని ఉపసంహరించుకుంటున్నామని తెలిపారు. దీనిపై కంగనా ఘాటుగాగానే రియాక్ట్ అయ్యారు. సిగ్గు, అవమానకరంగా ఉందని తన సోషల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో కూర్చున్న వారు చట్టాలు చేస్తే, వీధుల్లో ఉండేవాళ్లు సదరు చట్టాలను రూపొందించడంలో భాగం కాకుండా వాటిని వ్యతిరేకిస్తున్నారని కంగనా రనౌత్ పేర్కొన్నారు. ఇటీవల ఆమె పెళ్లి, పిల్లలు గురించి కూడా స్పందించి వార్తల్లో నిలిచారు. తెలుగులో ఈమె 2009లో ప్రభాస్ జోడిగా ఏక్ నిరంజన్‌లో నటించింది. ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తోనే బిజీగా మారింది. కంగనా రనౌత్ నటిగా తన కెరీర్‌ను స్టార్ట్ చేసి ఇప్పటికి పదిహేనేళ్లవుతుంది. ఈ పదిహేనేళ్లలో ఆమె ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొంది. క్వీన్, తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్ సాధించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. హీరోయన్‌గా తనకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంది. మణికర్ణికతో డైరెక్టర్‌గానూ మారింది. రీసెంట్‌గా ఆమె నటించిన చిత్రం తలైవి. తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం థాకడ్ వంటి పూర్తి స్థాయి యాక్షన్ సినిమాతో ఆకట్టుకోవడానికి రెడీ అయ్యారు. తేజస్ సినిమాలో యాక్ట్ చేస్తున్న కంగనా రనౌత్ ఇప్పుడు తన సొంత బ్యానర్‌లో టీకు వెడ్స్ షేరు అనే సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. వీటన్నింటితో పాటు ఇందిరా గాంధీ బయోపిక్‌లోనూ ఆమె నటించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం భారతదేవ ఉక్కు మహిళ అయిన ఇందిరా గాంధీ జీవితానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుని కథను రూపొందించే పనిలో అండ్ టీమ్ వర్క్ చేస్తుంది. దీనికి ఎమెర్జెన్సీ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DZi4lu
No comments:
Post a Comment