బాలీవుడ్ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన ఇప్పుడు ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఏప్రిల్ 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు టీమ్ రీసెంట్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజున యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీగా భారీ లెవల్లో విడుదలవుతుంది. నిజానికి ముందు ఆమిర్ ఖాన్ తన సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. కానీ రీసెంట్‌గా రిలీజ్ డేట్‌ను ఏప్రిల్ 14కి మార్చారు. దీంతో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య తెలియని పోటీ వచ్చేసింది. ఆల్ రెడీ ఎప్పుడో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న KGF Chapter 2 సినిమాకు పోటీగా ఆమిర్ ఖాన్ తన ‘లాల్ సింగ్ చద్దా’ను ఎందుకు విడుదల చేయడమంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే తన సినిమాను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ వివరించారు. ‘‘నిజానికి నేను సినిమాను త్వరగా చేసేయాలనే ఉద్దేశంతో చేయను. ఓ ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతూ అనుకున్న ఔట్‌పుట్ వచ్చేలా చూసుకుంటాను. లాల్ సింగ్ చద్దా విషయంలో కరోనా కారణంగా మా ప్రణాళికలన్నీ పాడయ్యాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్‌కారణంగా, సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ షూటింగ్‌ను పూర్తి చేస్తూనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ఏదో అవసరంగా సినిమాను పూర్తి చేసేసి విడుదల చేయాలనే తత్వం నాది కాదు. ప్రస్తుతం లాల్‌సింగ్ చద్దా వి.ఎఫ్.ఎక్స్ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయ్యేలోపు ఆలస్యం కావచ్చు. అదీ కాకుండా లాల్ సింగ్ చద్దా మూవీలో నేను సిక్కు యువకుడిగా కనిపిస్తాను. నేను అలాంటి పాత్ర చేయడం ఇదే తొలిసారి. కాబట్టి..సిక్కుల పండగ రోజైన బైసాంకి రోజునే నా సినిమాను విడుదల చేస్తే బావుంటుందనిపించింది. అందుకనే ఏప్రిల్ 14న మా సినిమాను విడుదల చేయాలనుకున్నాం. అదే రోజున విడుదలవుతున్న పాన్ ఇండియా మూవీ KGF Chapter 2 నిర్మాతలకు ఈ సందర్భంగా నేను సారీ చెప్పాలనుకుంటున్నాను.నేను వేరే ప్రొడ్యూసర్ ఫిక్స్ అయిన రిలీజ్ డేట్‌లో నా సినిమాను ఎప్పుడూ విడుదల చేయలేదు. కానీ ఈసారి అలా కుదిరింది. తప్పలేదు’’ అని విజయ్ కిరగందూర్‌కి సారీ చెప్పి తన హుందాతనాన్ని మరింత పెంచుకున్నారు ఆమిర్ ఖాన్. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్ . ఇందులో కరీనా కపూర్ హీరోయిన్. ఇక హీరోగా చేసిన KGF Chapter 1 హిట్ కావడంతో KGF Chapter 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదరుచూస్తున్నారు. రెండు సినిమాలు ఒకేరోజున బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CQleGW
No comments:
Post a Comment