టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున.. కొడుకు నాగచైతన్యతో కలిసి చేస్తోన్న చిత్రం ‘బంగార్రాజు’. ముందు టైటిల్‌ను చూసి అందరూ నాగార్జున బంగార్రాజుగా కనిపిస్తాడని అనుకున్నారు. సోమవారం విడుదల చేసిన మోషన్ పోస్టర్‌లో టైటిల్ పాత్రలో నాగచైతన్యే అని రివీల్ చేసి ఓ రకంగా షాకిచ్చారు. మంగళవారం(నవంబర్ 23) రోజున నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా మూవీ టీజర్‌ను మంగళవారం తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే..నాగార్జున అక్కినేని, నాగచైతన్య ఇద్దరూ బంగార్రాజు పాత్రల్లో కనిపించనున్నారు. బంగార్రాజుగా నాగార్జున, చిన బంగార్రాజుగా నాగచైతన్య కనిపిస్తారు. అంటే నాగార్జున మనవడి పాత్రలో చైతన్య కనిపించనున్నారన్నమాట. ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో పెద బంగార్రాజుగా అయిన నాగార్జున పెద్ద బంగార్రాజు గొలుసు, అభరణాలను ధరించి, తనలాగానే స్టైల్గా కర్రను తీసుకుని నేలకు కొడితే అది బుల్లెట్ వెనకభాగానికి వెళ్లి అలా ఫిక్స్ అవుతుంది. తర్వాత అదే బుల్లెట్‌పై నాగచైతన్య కూర్చోడాన్ని టీజర్‌లో గమనించవచ్చు.వచ్చాడు వచ్చాడు .. నవ మన్మథుడు వచ్చాడు.. అనే టీజర్ బ్యాగ్రౌండ్‌లో బీట్ వినిపిస్తోంది. సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం. సోగ్గాడే చిన్ని నాయనాకు ఇది సీక్వెల్. ఇందులో నాగార్జున మనవడు పాత్రలో నాగచైతన్య కనిపించబోతున్నారని టీజర్ ద్వారా చిన్న క్లూ ఇచ్చారు. చైతు జోడీగా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి కనిపించనుంది. రీసెంట్‌గా నాగలక్ష్మి అనే పాత్రను చేస్తున్న కృతి శెట్టి లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే లడ్డుండా అనే లిరికల్ సాంగ్ రీసెంట్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో నాగార్జున సరసన మరోసారి రమ్యకృష్ణ కనిపించనున్నారు. నాగార్జున కెరీర్‌లోనే బెస్ట్ హిట్‌గా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్‌గా వస్తున్న ‘బంగార్రాజు’ ఈ సంక్రాంతికి బలమైన పోటీలో నిలబడతాడో లేదో చూడాలి. ‘మనం’ తర్వాత నాగార్జున, చైతన్య కలిసి నటిస్తోన్న చిత్రమిది. చైతన్య సినిమాల విషయానికి వస్తే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమాతో పాటు అమీర్ ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’లో నటించాడు. త్వరలోనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్‌లో చైతన్య నటించబోతున్నాడు. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FL7csh
No comments:
Post a Comment