సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలకు, సామాన్య ప్రజలకు మధ్యదూరం చాలా వరకు తగ్గిపోయింది. నటీనటులు ఎప్పటికప్పుడు తమ తమ అప్‌డేట్స్ ఇస్తుండటం, వాటిపై కామెంట్ల రూపంలో నెటిజన్లు స్పందిస్తుండటం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడూ నెట్టింట అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. తెలిసో తెలియకో సెలబ్రిటీలు చేసిన చిన్న తప్పు పెద్ద రచ్చకు దారితీస్తుంటుంది. తాజాగా విషయంలో అదే జరిగింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు బండ్ల గణేష్. నెటిజన్లతో టచ్‌లో ఉంటూ వారు వేసిన ప్రశ్నలు, చేసిన ట్వీట్లపై స్పందిస్తూ ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పప్పులో కాలేశారు బండ్ల గణేష్. ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌పై రిప్లై ఇస్తూ పరోక్షంగా డైరెక్టర్ పరువు తీశారు. దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. సరిగా అర్థం చేసుకోకుండా రిప్లై పెట్టావా? లేక కావాలనే చేశావా అంటూ రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం చెప్పమంటారా.. ఈ రోజు (నవంబర్ 23) అనిల్ రావిపూడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. దీంతో ఈ ట్వీట్ చూసిన ఓ నెటిజన్‌కి చిన్న డౌట్ వచ్చినట్టుంది. అనిల్ పుట్టినరోజున బండ్లన్న ట్వీట్ చేశాడంటే పవన్ కళ్యాణ్‌తో అనిల్ సినిమా ఉండబోతుందేమో అనుకున్నాడు కాబోలు.. Pkతో మూవీ తీయొద్దు అన్ని చెప్పు అన్నా.. 10 లక్షలు ఇస్తాం అని కామెంట్ పెట్టాడు. ఇది సరిగా అర్థం చేసుకోలేదో లేక కావాలనే చేశాడో తెలియదు గానీ దీనిపై బండ్ల గణేష్ షాకింగ్ రిప్లై ఇచ్చాడు. 'థ్యాంక్యూ ఫర్ యువర్ లవ్' అంటూ తన స్పందన తెలియజేశాడు. దీన్నిబట్టి చూస్తే అనిల్ రావిపూడితో పవన్ కళ్యాణ్ సినిమా చేయకూడదని బండ్లన్న కోరుకుంటున్నట్లేగా. అంటే అనిల్ దర్శకత్వ ప్రతిభ నచ్చకనా? అనేది ఇక్కడ హాట్ ఇష్యూగా మారింది. ట్వీట్ గందరగోళంగా మారింది. అలాగే ఉన్నట్టుండి దీనిపై సినీ వర్గాల్లో చర్చ షురూ అయింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32eShb5
No comments:
Post a Comment