జాన్వీ ప్రయత్నానికి ఎన్టీఆర్ తోడు! స్కెచ్చేసిన కొరటాల.. ఈ సారి పక్కా..

శ్రీదేవి తనయ, బాలీవుడ్ హీరోయిన్ తెలుగు తెరపై ఆరంగేట్రం చేయనుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తల్లి లాగే తెలుగు ఆడియన్స్ మనసు దోచుకోవాలని ఆమె ప్రయత్నిస్తోందట. ఈ ప్రయత్నానానికి తోడు కాబోతున్నారనే టాక్ చాలా రోజులుగా నడుస్తోంది. గతంలో జాన్వీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు తెరపైకి తీసుకురాబోతున్నారనే వార్తలు షికారు చేయగా ఇప్పుడు స్కెచ్చేశారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. RRR మూవీ తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ వేట కొనసాగుతోంది. అయితే తొలుత ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్‌గా నటించనుందన్నట్లుగా వార్తలు రాగా.. ఇప్పుడు జాన్వీ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేస్తూ ఎన్టీఆర్‌తో చిందులేయించేందుకు కొరటాల పక్కాగా స్కెచ్చేశారట. ఈ మేరకు జాన్వీతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని టాక్. అతి త్వరలో ఇతర నటీనటులను, సాంకేతిక నిపుణుల్నీ ఎంపిక చేసి పూర్తి వివరాలు ప్రకటించనున్నారట కొరటాల శివ. గతంలో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' మూవీ నందమూరి అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చింది. దీంతో మరోసారి ఈ కాంబో మూవీ రానుండటం జనాల్లో ఆసక్తి పెంచేసింది. పైగా ఇదే సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ అని తెలుస్తుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. సో.. చూడాలి మరి ఈ విషయమై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CE48vP

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts