Salman Khan: చిరంజీవితో మూవీ అనగానే సల్మాన్‌ ఫీలింగ్స్! మెగా ఫ్యాన్స్ హుషారెత్తిపోయే న్యూస్

'సైరా' తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నా 'ఆచార్య'తో వేగంగా అడుగులేస్తున్నారు మెగాస్టార్ . వరుస సినిమాలకు కమిటవుతూ కుర్ర హీరోలకు చెమటలు పట్టేలా గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మోహన్ రాజా దర్శకత్వంలో ఆయన చేయబోతున్న కొత్త సినిమా 'గాడ్ ఫాదర్'. సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' తెలుగు రీమేక్‌గా భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందిస్తున్నారు. రీసెంట్‌గా చిరు బర్త్ డే కానుకగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ కూడా రిలీజ్ చేయడంతో సినిమాపై బజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ బయటకొచ్చింది. ఈ చిత్ర తారాగణం విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న చిత్ర యూనిట్.. ఒక్కొక్కరుగా నటీనటులను ఫైనల్ చేస్తున్నారట. తాజా సమాచారం మేరకు బాలీవుడ్‌ స్టార్ హీరో ఈ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న సల్మాన్.. తన డెట్స్‌ సర్దుబాటు చేసుకొని మరీ ‘’ మూవీకి తన షెడ్యూల్‌ ఖరారు చేశారట. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపారట. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. సల్మాన్, చిరులను ఒకే తెరపై చూడబోతున్నామంటూ ఖుషీ అవుతున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ బాణీలు కడుతున్నారు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ నటీనటులను ఈ సినిమాలో భాగం చేసే ప్రయత్నాలు చేస్తున్నారట డైరెక్టర్ మోహన్ రాజా. ఇప్పటికే యాంకర్ అనసూయ, నయనతార, సత్యదేవ్ పేర్లు కన్ఫర్మ్ అయినట్లు టాక్. మరికొద్ది రోజుల్లో అన్ని విషయాలపై పూర్తి క్లారిటీ రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WirqIR

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts