బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ చిన్న కుమార్తె, నిర్మాత శనివారం జరిగిన సంగతి తెలిసిందే. తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ బులానీని ఆమె పెళ్లాడింది. ముంబైలోని జుహులో ఉన్న అనిల్ నివాసంలో కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిపారు. అయితే నిన్న (సోమవారం) రోజు అనిల్ కపూర్ తన కుమార్తె వివాహ విందు ఏర్పాటు చేసి పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించారు. రియా- కరణ్ వివాహ బంధంతో ఒక్కటైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విందులో ఫరా ఖాన్, అర్జున్ కపూర్, అన్షులా కపూర్, సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా, బోణీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అంతా కలిసి విందు ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగారు. అనిల్ ఇంట సందడి వాతావరణం కనిపించింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా భర్త కరణ్ బులానీతో కలిసి ఉన్న తమ పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ అతడిపై తనకున్న ప్రేమను బయటపెట్టింది రియా కపూర్. ప్రాణ స్నేహితుడిని జీవిత భాగస్వామిగా పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటూ ఎమోషనల్ అయింది. ''పన్నెండేళ్ల తర్వాత ఈ రోజు నేను ఎంతగా ఏడ్చానో.. అలాగే భయంతో వణికిపోయానో నాకే తెలుసు. ఇలాంటి ఒక అద్భుతమైన క్షణాన్ని, ఆనందాన్ని నేను ఇంతవరకు అనుభవించలేదు. ప్రతి రోజు రాత్రి 11 గంటల కంటే ముందే అది కూడా నా తల్లిదండ్రులు నిద్రపోకముందే ఇంటికి చేరుకునే అమ్మాయిని. ఇప్పుడు మనదైన కొత్త కుటుంబంలో అడుగుపెడుతూ కూడా అమ్మానాన్నలు, నా తోబట్టువులతో కలిసి జీవించడం గొప్ప అనుభూతి'' అని రియా పేర్కొంది. రియా భర్త కరణ్ బూలానీ పలు యాడ్స్ నిర్మించి గుర్తింపు పొందాడు. రియా- కరణ్ బులానీ ఇద్దరూ కలిసి ఐషా, వేక్ అప్ సిద్ వంటి చిత్రాలకు కలిసి పనిచేశారు. పలు బాలీవుడ్ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది రియా. సోషల్ మీడియాలో వీరి పెళ్లిపై స్పందిస్తున్న పలువురు సెలబ్రిటీలు.. బెస్ట్ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. అనిల్ కపూర్ చిన్న కుమార్తె, నిర్మాత పెళ్లి శనివారం జరిగిన సంగతి తెలిసిందే. తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ బులానీని ఆమె పెళ్లాడింది. ఈ సందర్భంగా సోమవారం రోజు విందు ఏర్పాటు చేశారు అనిల్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XpiDVo
No comments:
Post a Comment