ఇప్పుడు క్షణం తీరిక లేకుండా సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో ఒక్క ప్రాజెక్ట్ చేయడం లేదని రకుల్ మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా.. ఆమె డైరీ మాత్రం ఫుల్లుగానే ఉంది. ఆ మధ్య రకుల్ చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదని రూమర్లు వచ్చాయి. ఆమెను టాలీవుడ్ పక్కన పెట్టేసిందని కథనాలు వచ్చాయి. దాని మీద రకుల్ తన స్టైల్లో స్పందించారు. ఇప్పుడు ఏడాదికి ఆరు చిత్రాలు చేస్తున్నాను.. అయినా కూడా నేను ఖాళీగానే ఉన్నానని అంటున్నారు.. ఒక వేళ డేట్లను అడ్జస్ట్ చేసే నైపుణ్యమున్న వారుంటే.. నా దగ్గరకు రండి అని కౌంటర్లు వేశారు. అలా రకుల్ ఇప్పుడు మూడు నాలుగు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో అజయ్ దేవగణ్‌తో రెండు చిత్రాలు చేస్తున్నారు. ఇక మరొకటి హీరోగా వస్తోన్న ఓ సినిమాలో రకుల్ నటిస్తున్నారు. డాక్టర్ జీ అంటూ రాబోతోన్న ఈ మూవీలో రకుల్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అలహాబాద్‌లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే షూటింగ్ సెట్లో లంచ్ సమయంలో అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. స్వీట్లు పద్దతిగా ఎలా ఒకదాని తరువాత మరొకటి తినాలో ఆయుష్మాన్ చెబుతున్నారట. అయితే లంచ్‌లో ఫుల్లుగా లాగించిన రకుల్ ఓ కునుకు తీయాలని ఫిక్స్ అయినట్టున్నారు. ఈమేరకు ఇదే విషయాన్ని తన ఫాలోవర్లను అడిగేశారు. మంచిగా మెక్కిన తరువాత మధ్యాహ్నం కాసేపు పడుకోవడం ఎవరికి ఇష్టం అని రకుల్ అడిగేశారు. అయితే రకుల్ కూడా బాగానే తిన్నట్టున్నారు. ఇక మెల్లిగా నిద్రలోకి జారుతున్నట్టుగా కనిపిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3smQcCT
No comments:
Post a Comment