కొత్త ఆరంభం అంటూ కీర్తి సురేష్ రచ్చ.. వ్యవహారం మామూలుగా లేదు!!

ప్రస్తుతం హీరోయిన్‌గా మరీ అంత ఫాంలో ఏం లేరు. తెలుగు చిత్రాల విషయానికి వస్తే ఆమె చేతిలో ఒక్కటే ఉంది. ఇక విడుదలకు సిద్దంగా మరో చిత్రం ఉంది. గుడ్ లక్ సఖి అనే సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదాలు పడుతూనే వస్తోంది. ఓటీటీలో గుడ్ లక్ సఖి రాబోతోందనే వార్తలు ఆ మధ్య వచ్చాయి. కానీ కీర్తి సురేష్‌కు ఓటీటీ కలిసి రావడం లేదు. గత ఏడాది కీర్తి సురేష్ ఓటీటీలో బాగానే హల్చల్ చేశారు. పెంగ్విన్, మిస్ ఇండియా వంటి సినిమాలన్నీ ఓటీటీలోనే వచ్చాయి. ఇక రంగ్ దే సినిమా థియేటర్లో వచ్చినా కూడా ఫలితం మాత్రం ఆశించినట్టుగా రాలేదు. ఇక కోలీవుడ్‌లో ఇప్పుడు రజినీ అన్నాత్తె చిత్రంలో నటిస్తున్నారు. రజినీ చెల్లెలిగా కీర్తి సురేష్ నటించబోతోన్నట్టు తెలుస్తోంది. అయితే కీర్తి సురేష్ ఇప్పుడు కొత్తగా ఏదో ట్రై చేయబోతోన్నట్టు ప్రకటించారు. కొత్త వెంచర్, కొత్త ఆరంభం అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలను గమనిస్తూ ఉంటే ఏదో సంప్రదాయ ఉత్తత్పికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతోన్నట్టు కనిపిస్తోంది. కొత్తగా ఏదైనా సౌందర్య ఉత్పత్తులకు సంబంధించిన వాటిని ప్రారంభించబోతోందో? లేదా ఏదైనా కొత్త ప్రొడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతోందో తెలియడం లేదు. ఆ ఫోటోల్లో మాత్రం ఏవో పువ్వులను కోసి.. వాటితో ఏదో మిశ్రమాన్ని తయారు చేసినట్టు కనిపిస్తోంది. ప్రకృతి శక్తిని తెలియజేసేలా తన తదుపరి వెంచర్ ఉండబోతోందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. ఈ కొత్త వెంచర్‌ను క్రియేట్ చేసే క్రమంలో ఎంతో సరదా విషయాలు జరిగాయని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37NxV8z

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts