కరోనా కష్టకాలంలో పేదల పాలిట ఆపద్బాంధవుడిలా మారి ఎన్నో సేవలు చేస్తున్నారు. ఎంతోమంది బాధితుల ప్రాణాలు కాపాడుతూ రియర్ హీరో అనిపించుకుంటున్నారు. ఏడాదిపైగా ఆయన సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజల కోసం ఆయన శ్రమిస్తున్న తీరు అభినందమీయం. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనూ సూద్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల పట్ల ఆవేదన చెందుతూ రాజకీయ నేతలపై కామెంట్స్ చేశారు. గతేడాదితో పోల్చితే దేశంలో ఇప్పుడు దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని, సరైన వసతుల్లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే.. అది చూసి చలించిపోయానని సోనూ సూద్ అన్నారు. తమ కుటుంబ సభ్యులను, ఆప్తులను, ప్రియమైన వారిని కోల్పోయి ప్రతిరోజూ ఎంతో మంది కన్నీరు పెట్టుకుంటున్నారని.. ఈ పరిస్థితులు చూశాక తన తల్లిదండ్రులు సరైన సమయంలో కన్నుమూశారని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒకవేళ వాళ్లే కనుక ఇప్పుడు ఉండి ఉంటే.. వాళ్లు పడే ఇబ్బంది చూసి తన హృదయం ముక్కలయ్యేదని చెప్పారు. సాయం చేయడంలోనే అసలైన సంతోషం ఉందని తెలుసుకున్నానని, అందుకే లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు చేతనైనంత సాయం అందిస్తున్నామని సోనూ తెలిపారు. ఇక ఇప్పటికైనా రాజకీయ నాయకులందరూ ఒకరిపై ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు మానుకొని ప్రజలకు సాయం అందించాలని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా పేషెంట్స్ చాలామంది సమయానికి ఆక్సిజన్ అందక కన్నుమూస్తుండటం చూస్తున్నాం. ఇలాంటి ఆపత్కాల సమయంలో కేవలం ఒకే ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే.. మీకు ఆక్సిజన్ ఇస్తానంటూ ముందుకొచ్చారు సోనూ సూద్. ఆయన సేవలను పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fHWVSc
No comments:
Post a Comment