దేశంలో మహమ్మారి పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకక, సమయానికి ఆక్సీజన్ అందక ఎంతోమంది కన్నుమూస్తున్నారు. నిత్యం కనిపిస్తున్న ఈ హృదయ విదారకర సంఘటనలు జనాల్లో భయాందోళనలు నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పట్ల అవగాహన నెలకొల్పుతూ తమ వంతుగా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు పలువురు సెలబ్రిటీలు. ఇప్పటికే సోనూ సూద్ ప్రత్యేకంగా కోవిడ్ బాధితులకు సాయం అందిస్తుండగా.. తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య ముందుకొచ్చింది. కరోనా కష్టకాలంలో అవసరంలో ఉన్న వాళ్లు తనకు మెసేజ్ చేస్తే సహాయం చేసేందుకు రెడీగా ఉన్నానంటూ లైవ్ వీడియో ద్వారా సందేశమిచ్చింది. ప్లాస్మా, ఆక్సిజన్, మెడిసిన్ ఇలా ఎలాంటి అవసరం ఉన్నా తనకు మెసేజ్ చేయండని, ఆ మెసేజ్‌ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి అవసరమైన సాయం అందేలా కృషి చేస్తానని ఆమె చెప్పింది. లాక్ డౌన్ కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండండని చెప్పింది. గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు సరిపోవడంలేదని అనిపించి నేను ముందుకొచ్చా. నిజంగా అవసరం ఉన్నవాళ్లు మెసేజ్ చేయండి. వైద్య సదుపాయాలకు సంబంధించి అన్ని రకాలుగా సాయం చేయడానికి రెడీగా ఉన్నా కానీ.. దయచేసి ఎవ్వరూ డబ్బుల జోలి తీసుకురావొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అలా చాలాసార్లు మోసపోయాను. డొనేషన్స్ అంటూ చీట్ చేశారు. కాబట్టి ప్లాస్మా, ఆక్సీజన్, బెడ్స్ లాంటి అవసరాల గురించి మాత్రమే అడగండి. రోజూ తెలిసిన వాళ్లలో ఎవరో ఒకరు చనిపోతుండటం బాధగా అనిపిస్తోంది. కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండండి. బోర్ కొట్టకుండా మూవీస్ చూడండి, సాంగ్స్ వినండి.. మనసుకు నచ్చిన పని చేయండి అని రేణూ దేశాయ్ చెప్పింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R5JfrY
No comments:
Post a Comment