దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్ మరింత భయానకంగా కనిపిస్తోంది. నిత్యం లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సెలబ్రిటీలు ఒక్కొకరుగా తమకు తోచిన సాయం అందిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ తన సహాయక చర్యలను మరింత పెంచేయగా.. పవన్ కళ్యాణ్ మాజీ భర్య రేణూ దేశాయ్ అవసరమున్న వారికి వైద్య సాయం అందించడానికి కృషి చేస్తానని చెప్పింది. తాజాగా అదే బాటలో ముందుకొచ్చి సాయం కోసం కాల్ చేయండి అంటూ ఓ ఫోన్ నెంబర్ ఇచ్చేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో సాధారణ దగ్గు వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా కరోనా కావొచ్చని జనం కంగారు పడుతున్నారు. ఇంట్లోనే ఉండి భయం భయంగా బతుకుతున్నారు. ఇలాంటి వారి కోసం హీరోయిన్ నమిత ఓ కీలక సూచన చేసింది. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే భారతీయ జనతా యువ మోర్చా () కోవిడ్ హెల్ప్ లైన్‌కు కాల్ చేసి ఉచితంగానే డాక్టర్‌ను సంప్రదించవచ్చని తెలుపుతూ ఓ వీడియో ద్వారా సందేశమిచ్చింది. ''హాయ్.. మీరు కోవిడ్ లక్షణాలతో బాధ పడుతున్నారా? అయితే ఆందోళన చెందకండి. మీరు ఇంట్లో ఉంటూనే ఉచితంగా డాక్టర్‌ను సంప్రదింవచ్చు. భారతీయ యువ మోర్చా హెల్ప్ లైన్ నెంబర్ 080 68173286 నెంబర్‌కు కాల్ చేస్తే వైద్య నిపుణులు మీకు సలహాలు, సూచనలు ఇస్తారు'' అని నమిత ఈ వీడియోలో తెలిపింది. అలాగే ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అందరితో పంచుకుంది. అయితే నమిత పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి కొంతమంది నెటిజన్స్ 'గ్రేట్ ఐడియా' అని, ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎంతోమందికి ఉపయోగం అని కామెంట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం దీన్ని విమర్శిస్తున్నారు. చివరకు కరోనాను కూడా ఇలా రాజకీయ కోణంలో ఉపయోగించుకోవడం దురదృష్టకరం అని విమర్శలు గుప్పిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33Ggcxy
No comments:
Post a Comment