ఎమ్మెస్ నారాయణ సెట్‌కి తాగి వచ్చి నన్ను గదిలోకి లాక్కుపోయాడు.. నేను అలా చేసేసరికి..: నటి పద్మ జయంతి

సీనియర్ ఆర్టిస్ట్ చాలా చిత్రాల్లో కనిపిస్తూనే ఉంటుంది. దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించిన పద్మ జయంతి.. తల్లిగా.. వదినగా.. ఇతర పాత్రల్లో కనిపించింది. అయితే తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ టాలీవుడ్ ఇండస్ట్రీపైన సీనియర్ నటులపైన షాకింగ్ కామెంట్స్ చేసింది.. తాను 350 చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు సరిగా గుర్తుపట్టడం లేదంటే.. దాదాపు 200 సినిమాల్లో తనని ఎదగనీయకుండా దొక్కేయడమే కారణం అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా చలపతిరావు, చంద్రమోహన్ తదితరులు సీనియర్ నటులపై తీవ్ర ఆరోపణలు చేయగా.. దివంగత నటుడు, స్టార్ కమెడియన్ తనతో తాగి వచ్చి మిస్ బిహేవ్ చేశారంటూ నాడు సెట్ ఆయన ఎలా ప్రవర్తించాడో చెప్పుకొచ్చింది. నేను ఇండస్ట్రీలో ఎన్ని బాధలు పడ్డానో.. నేను ఏడ్వడం కాదు.. ఎదుటి వాళ్లు ఏడుస్తారు. కానీ బయటకు చెప్పుకోలేను. ఎందుకుంటే.. నన్ను చూసి నా వెనుక చాలామంది ఏడుస్తారు. నన్ను చాలామంది చాలా రకాలుగా హింసించారు. సీనియర్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ గారు సెట్స్‌లోనే నాతో అసభ్యకరంగా ప్రవర్తించారు. మేం ఇద్దరం కలిసి ఓ సినిమాకి చేస్తున్నాం.. అప్పటికి నా పరిస్థితి ఏంటి అంటే మా అత్తగారు చనిపోయి నెలరోజులైంది. నెలకార్యం జరిపిస్తుండగా.. నేను షూటింగ్‌కి రావాల్సివచ్చింది. ఆ విషయంపై మా ఆయన్ని నానా మాటలు అన్నారు. అయినా షూటింగ్‌ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అది దాదాపు 22 మంది కమెడియన్లతో సీన్.. తప్పుకుండా అందరూ ఉండాల్సింది. అయితే సెట్‌లో నేను కూర్చుని ఉండగా.. వెనుక నుంచి ఒకరు వచ్చి నా చేయి పట్టుకుని లాక్కుని వెళ్తున్నారు.. ఎవరా అని చూస్తే.. ఎమ్మెస్ నారాయణ గారు. ఆయన పర్సనాలిటీ నాలో సగం ఉంటుంది కానీ.. నన్ను పట్టుకుని లాక్కుపోతున్నారు. ఇదేంటి సార్ అంటే.. ఏం లేదు నీతో మాట్లాడే పని ఉంది. రా.. మాట్లాడాలి అని అన్నారు. అప్పటికే ఆయన దగ్గర మందు వాసన వస్తుంది. సెట్‌కి తాగి వచ్చేశారు. తాగిన మైకంలో నన్ను చేయిపట్టుకుని గదిలోకి లాక్కుపోతున్నారు. ఇదేంటి సార్.. అని అంటే.. ఎహే రావే అని ఆయన లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నారు. ఒక్కసారి చేయి విడిపించుకున్నా.. ఇదేం పనిసార్ అని సీరియస్ అయ్యాను. ఇంక ఆయన నువ్ బాగున్నావ్.. సెక్సీగా ఉన్నావ్ అంటూ ఏంటేంటో మాట్లాడి.. రా నీతో పని ఉందని అన్నారు. నా చేయి మాత్రం వదలడం లేదు. నాకు అతని పరిస్థితి అర్థమైంది.. పైగా తాగి ఉన్నాడని అర్థం చేసుకుని.. బలవంతంగా చేయి లాక్కుని.. ఏంటి సార్?? అసలు ఏం మాట్లాడుతున్నారు.. షూటింగ్‌లో ఉన్నాం.. లొకేషన్‌కి షూటింగ్ కోసం రాలేదా ఏంటి?? అని అడిగా. ఎహే.. షూటింగ్ చేసే మూడ్ లేదు నాకు అని అన్నారు. అయితే ఇంటికి వెళ్లిపోండి మూడ్ వస్తుంది అని అన్నారు. మా ఇద్దరి మధ్య చాలా గొడవ జరిగింది. ఆ తరువాత కూడా నాతో చాలా రఫ్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఇక లాభం లేదనుకుని.. ఎంతవరకూ సరదాగా ఉండాలో అంతవరకే ఉండాలి అనుకుని.. నేను రాను అని గట్టిగా చెప్పాను. అయినా ఆయన అది కాదు అని మిస్ బిహేవ్ చేయబోయాడు. నాకు ఒళ్లు మండిపోయింది. వెంటనే పైకి లేచి పీకపట్టుకుని గోడదగ్గర నిలబెట్టేశా. ఆయన నాలో సగం ఉంటారు. గట్టిగానే తిప్పికొట్టా. దీంతో ఆయన నా పీక పట్టుకుందని గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అందరూ వచ్చేశారు.. ఆయన్ని పక్కకి తీసుకుని వెళ్లారు. అందరూ నన్ను కూల్ చేయడానికి ట్రై చేశారు. ఆయన పెద్ద కమెడియన్ కాబట్టి.. విషయాన్ని పెద్దది చేయకుండా మాట్లాడారు. అంటే నాకు ప్రాబ్లమ్ అవుతుందని సర్దిచెప్పారు. కానీ ఇష్యూ పెద్దది అయిపోయింది.. నేను వెళ్లి యూనియన్‌లో కంప్లైంట్ చేయడం.. పెద్దవాళ్లు వచ్చి మాట్లాడటాలు.. జరిగాయి. ఆ పెద్దలు నాకు ఫోన్ చేసి.. నీకు లైఫ్ ఉండదు.. పెద్ద కొండను ఢీ కొడుతున్నావ్ అని అన్నారు. నేను పడ్డ బాధల్లో ఇది ఎంతలే అని వెనక్కి తగ్గలేదు. ఈరోజు నేను వదిలేస్తే.. నా వెనుక వేరే వాళ్లు బాధపడతారని అనుకున్నా.. కానీ నాకు ఆ పరిస్థితులో ఒకటి అర్థం అయ్యింది మనకంటూ ఒక సపోర్ట్ కావాలి అని. సపోర్ట్ లేకపోతే ఎవడైనా అడ్వాంటేజ్ తీసుకుంటాడని అర్థమైంది. ఆ ఇష్యూతో దాదాపు 10 సినిమాల వరకూ పోయాయి. నటించకుండా చేశారు. చాలామంది బెదిరించారు. పొరపాటున ఏదైనా సినిమా చేస్తుంటే నిర్మాతకి చెప్పి క్యాన్సిల్ చేయించేవారు. ఆ తరువాత మెల్ల మెల్లగా నా సినిమాలు నేను చేసుకున్నాను’ అంటూ తనకి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ పద్మ జయంతి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3353rww

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts