బుల్లితెర యాంకర్, నటుడు ప్రదీప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి పాండు రంగ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈరోజు (ఆదివారం) తెల్లవారు జామున మరణించినట్లు తెలిసింది. అయితే ఆయన కరోనా కారణంగా మరణించారనే వార్తలు వస్తున్నప్పటికీ దానిపై అధికారిక సమాచారం లేదు. ప్రదీప్ ఇంట నెలకొన్న ఈ విషాదంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చురకైన పంచులతో ఆకట్టుకునే ఆయన.. ఇటీవల '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రాన్ని సుకుమార్ దగ్గర కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన మున్నా అనే కుర్రాడు ఈ సినిమా రూపొందించాడు. వసూళ్ల పరంగా ఈ సినిమా భేష్ అనిపించుకుంది. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QMiNTW
No comments:
Post a Comment