మంచు వారమ్మాయిగా, మోహన్ బాబు కుమార్తెగా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఓ వైపు సినిమా చేస్తూనే, నిర్మాతగా, టెలివిజన్ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ హంగామా చేస్తోంది మంచు లక్ష్మి. మరోవైపు సోషల్ మీడియాలోనూ దూకుడుగా వ్యవహరిస్తున్న ఆమె.. ఈ మధ్యకాలంలో తన ట్వీట్స్ కారణంగా ట్రోల్స్ బారిన పడుతోంది. నిజానికి ట్రోల్స్ అనేవి ఆమెకు కొత్తేమీ కాకపోయినా గత కొన్నిరోజులుగా మాత్రం ఆమెను ఓ ఆటాడుకుంటున్నారు నెటిజన్లు. మాట్లాడే మాటల్లో, చేసే చేష్టల్లో ప్రత్యేకత చూపే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేసే పోస్టులు, ఇచ్చే కొటేషన్స్ లోనూ అదే కంటిన్యూ చేస్తోంది. ఈ కరోనా విలయతాండవంలో అయితే మరీ ఎక్కువగా ఫోకస్ అవుతూ ట్రోల్స్ బారిన పడుతోంది ఈ మంచువారమ్మాయి. ఇటీవలే కేటీఆర్‌కి కరోనా వస్తే తన సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేసుకోమని చెప్పిన ఆమె.. రీసెంట్‌గా వాక్సిన్ తీసుకున్నా అని చెప్పి అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన ట్వీట్‌తో నెటిజన్స్‌కి దొరికిపోయింది మంచు లక్ష్మి. కరోనా విలయతాండవంలో అంతా ఇంట్లోనే ఉండాలి.. సేఫ్‌గా ఉండాలని ప్రభుత్వంతో పాటు పలువురు సెలబ్రిటీలు జనాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇదే బాటలోనే వెళ్లిన మంచు వారమ్మాయి.. 'రియల్ హీరోలయితే ఇంట్లోనే ఉండండి. మీరు రియల్ హీరోనా లేక తుస్ వ్యక్తులా? అనేది మీరే డిసైడ్ చేసుకోండి' అని ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్‌లో 'తుస్' అనే పదం చూసి ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. ''ఇదెక్కడి మాస్ ట్వీట్ రా మావా.., బాబోయ్ ఇదేం ఇంగ్లీష్, నీ చర్యలు ఊహాతీతం అక్కా'' అంటూ మంచు లక్ష్మిపై అటాక్ షురూ చేశారు. అయితే వీటిపై ఆమె రియాక్ట్ కూడా అవుతుండటం ఇక్కడ అసలు పాయింట్. 'ఇట్స్ మై ఇంగిలిపీసు' అంటూ మంచు లక్ష్మి స్పందించడం కొసమెరుపు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q5ybdG
No comments:
Post a Comment