సినిమా రౌండప్: శరీరాకృతిపై ప్రియాంక కామెంట్స్.. మరో కెరీర్‌ను ఎంపిక చేసుకున్న ఇలియానా

శరీరాకృతిపై కామెంట్స్ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి సక్సెస్ సాధించిన ప్రియాంక చోప్రా.. ‘క్వాంటికో’ అనే సినిమాతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అమెరికాకు చెందిన సింగర్ నిక్‌ జోనస్‌ను పెళ్లి చేసుకున్న ఆమె అక్కడే సెటిల్ అయింది. అయితే తాజాగా తన శరీరాకృతిపై ప్రియాంక ఆసక్తికర కామెంట్స్ చేసింది. వయస్సు పెరుగుతున్న కారణంగా తన శరీరాకృతిలో మార్పులు వస్తున్నాయన్న ప్రియాంక.. ఆ మార్పులను స్వీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. మహేశ్-త్రివిక్రమ్ సినిమాలో అక్కినేని హీరో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. ఇప్పటికే ఈ విషయంపై త్రివిక్రమ్ ఆయనతో చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తుంది. ‘పుష్ప’ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్.. అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మాస్ సాంగ్స్ తో పాటు ఓ మాంచి మసాలా సాంగ్ కూడా ఉందని సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ వెల్లడించాడు. అయితే ఈ పాట మొదటి భాగంలో కాకుండా రెండో భాగంలో ఉంటుందని తెలుస్తోంది. అనుష్క ఫోటోపై క్లారిటీ ‘నిశ్శబ్ధం’ సినిమాతో గత ఏడాది ప్రేక్షకులను పలకరించిన స్వీటీ అనుష్క.. మళ్లీ ఏ ప్రాజెక్టులోనూ కనిపించలేదు. ఆమె తదుపరి సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్‌ కూడా రాలేదు. అయితే తాజాగా అనుష్కకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో ఆమె కాస్త బొద్దుగా ఉండటం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదని.. గత ఏడాది హరిద్వార్‌కి వెళ్లిన సమయంలో దిగిన ఫోటో అని అనుష్క సన్నిహితులు వెల్లడించారు. కొత్త కెరీర్ ప్రారంభించిన కెరీర్ ఆరంభించిన కొంతకాలంలోనే స్టార్ హీరోయిన్‌ స్టేటస్ సాధించింది నటి ఇలియానా. తెలుగులో సినీ ప్రస్థానం ప్రారంభించిన ఈ గోవా బ్యూటీ.. ఆ తర్వాత దక్షిణ సినీ ఇండస్ట్రీలతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది. గత కొంతకాలంగా సరైన హిట్లు లేక సతమతమవుతోంది. ఇక సోషల్‌మీడియాలో ఇలియానా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన స్వహస్తాలతో చాక్లెట్‌ కేక్ తయారు చేసిన ఆమె.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఇలా వంట చేయడం తనకు మరో కెరీర్ అవుతుందేమో అని కొటేషన్ పెట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tNWniK

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts