దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలవుతుండగా ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది. కేవలం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని, ఆ సమయంలోనే ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకొని ఇంట్లోనే ఉండాలంటూ తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తన అభిమానులతో లైవ్ చాట్ చేసిన ఈ విషయమై స్పందించింది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తోంది సింగర్ సునీత. పెద్దగా కాంట్రవర్సీల జోలికి పోకుండా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఈ మేరకు సమాజంలోని అనేక విషయాలపై రియాక్ట్ అవుతున్న ఆమె.. లాక్ డౌన్ ప్రకటనతో రాష్ట్రంలోని మందుబాబుల తీరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కరోనా విజృంభణతో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొంది. ఇన్స్‌స్టాగ్రామ్‌లో కొంతసేపు లైవ్ చాట్ చేసిన సునీత ఫాలోవర్స్ కోసం వారడిగిన పాటలు పాడి ఉత్తేజం నింపింది. ప్రతిరోజూ మీ అందరి కోసం పాడడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన ఆమె.. ఎవరు అక్కడికి వెళ్ళకుండా ఈ పది రోజులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. కరోనా కట్టడి అనేది ఒక్కరితో జరిగే పని కాదు.. అందరం బాధ్యతగా వ్యవహరిస్తేనే కరోనా నుంచి బయటపడగలుగుతామని చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ ప్రకటన వల్ల కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ ఈ పరిస్థితుల్లో ఇదే బెటర్ అని అనిపిస్తోందని సునీత చెప్పింది. అంతా తమకు కావాల్సిన వస్తువులు తెచ్చుకున్నారు. కానీ లాక్ డౌన్ ప్రకటన తర్వాత మద్యం దుకాణాల వద్ద పరిస్థితి చూస్తే దారుణంగా అనిపిస్తోందంటూ ఆమె కామెంట్ చేసింది. కాగా బుధవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఏకంగా 94 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ జరిగిందని రిపోర్ట్ రావడం అందరికీ ఒకింత షాక్‌కి గురి చేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hA5wJl
No comments:
Post a Comment