రామ్ గోపాల్ వర్మ.. ఈయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ నడిపిస్తూనే జనాల్లో హాట్ టాపిక్ అవుతుండటం ఒక్క వర్మకే చెల్లుతుందని చెప్పుకోవచ్చు. ఇదీ అదీ అని కాదు సమాజంలోని అన్ని విషయాలపై ఓపెన్ అవుతుంటారు వర్మ. ఎవరేమనుకుంటే నాకేంటి? నాకు తెలిసింది, నాకు నచ్చింది నేను మాట్లాడతా అనేది వర్మ సూత్రం. ఈ నేపథ్యంలోనే మదర్స్ డే సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనదైన మాటలతో వెరైటీకి మారు పేరు అనిపించుకున్నారు . ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే పలు విషయాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న ఆయన.. మదర్స్ డే సందర్భంగా మరోసారి హాట్ బ్యూటీ అప్సర రాణిని లైన్ లోకి తీసుకొచ్చి ఈ లోకంలోని తల్లులను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నీలాంటి ఏంజెల్ క్వీన్‌కు జన్మనిచ్చినందుకు మామ్‌కు స్పెషల్ థ్యాంక్స్ అంటూ , ఆమె అమ్మ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు వర్మ. ''పుట్టినరోజు శుభాకాంక్షలు మమ్మీ.. మీరు నా అభిమాన వ్యక్తి. మీరు ప్రతి రోజు నన్ను ప్రేరేపిస్తారు. నన్ను జీవితంలో చాలా బలంగా స్వతంత్రంగా బతికేలా చేసినందుకు ధన్యవాదాలు. నా బెస్ట్ ఫ్రెండ్'' అని అప్సర రాణి చేసిన ట్వీట్‌ని రీ- ట్వీట్ చేస్తూ 'నీలాంటి అద్భుతమైన బిడ్డలను కన్న తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు' అని తెలిపారు రామ్ గోపాల్ వర్మ. అంతటితో ఆగని ఆర్జీవీ.. తన తల్లికి మాత్రం అన్ హ్యాపీ మదర్స్ డే అని చెప్పారు. ఎందుకంటే నేను నీకు ఎప్పుడూ సంతోషకరమైన రోజును ఇవ్వలేదు అని వర్మ పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ ట్వీట్స్‌పై నెటిజన్స్ బిన్నంగా స్పందిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w2GDKh
No comments:
Post a Comment