
జబర్దస్త్ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్‌తో ఇంటికే పరిమితమైన రష్మీ అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. తాజాగా మూగజీవాల కోసం ఆహారాన్ని కూడా అందించింది. తనతో పాటు అంతా కూడా మూగజీవాల కోసం కూడా కాస్త మొత్తాన్ని విరాళంగా అందించాలని కోరింది. అయితే తాజాగా ప్రధాని పిలుపు మేరకు రాత్రి 9 గంటల 9 నిమిషాలకు రష్మీ సైతం క్యాండిల్ వెలిగించింది. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయినా గో కరోనా పాట పాడింది రష్మీ. రాత్రి చాలామంది క్యాండిల్స్, దీపాలు వెలిగిస్తే... మరికొందరు బాణాసంచా కాల్చారు. దీనిపై రష్మీ మండిపడింది. ప్రధాని మనల్ని దీపాలు, క్యాండిల్స్ మాత్రమే వెలిగించమన్నారంది. పటాకులు కాల్చమని ఎవరూ చెప్పలేదు. బాణసంచా కాల్చడానికి ఇది దీపావళి పండగ కాదంది. భగవంతుడు ఈ ప్రజల్ని నువ్వే మార్చాలంటూ రష్మీ అసహనం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 22న జనతా కర్ఫ్యూ సమయంలో ప్రధాని ఇంటి బాల్కాని నుంచి చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు. అప్పుడు కూడా కొందరు జనం గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చారు. అంతేకాదు డప్పులు కొట్టుకొని హల్ చల్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. ఆ తర్వాత నిన్న లైట్ దియా కార్యక్రమం సందర్భంగా కూడా ఓ వీడియా వాట్సప్‌లో తెగ చక్కర్లు కొట్టింది. గో కరోనా గో కరోనా అని పాట పాడుతూ చాలామంది గుంపులు గుంపులుగా కాగడలతో బయటకు పరుగులు తీస్తున్న వీడియో ఒకటి హల్ చల్ చేసింది. దీన్ని చాలామంది తమ వాట్సాప్ స్టేటస్‌లుగా కూడా పెట్టారు. తాజాగా ఆ పాట పాడిన రష్మీ... జనం తీరుపై మండి పడింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34b4ydI
No comments:
Post a Comment