
పెళ్లికి ముందైనా తరువాత అయినా.. అర్థం చేసుకోవడం అనేది 25 శాతం మాత్రమే. అర్థం అయ్యేలా ఉండటం అనేది 75 శాతం. నాన్న అంటే నాకు నమ్మకం.. ఆ నమ్మకమే అతన్ని పెళ్లి చేసుకునేలా చేసింది. కూతురు బాగా బతకాలి అనుకుంటే కోట్లు ఉన్న వాడికి ఇచ్చి చేసేవాడు. కాని కూతురు ఆనందంగా బతకాలి అనుకున్నారు కాబట్టే.. ఒక మంచోడికి ఇచ్చి చేశారు. అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చినా తల్లి ఒక్కరే ఉంటారని తక్కువ జీతం అమ్మతోనే ఉండిపోయిన అతగాడి గురించి చెప్పాలంటే ఇంతకంటే ఏం చెప్పాలి. ఇక అమ్మాయి అంటారా.. పేరు మహలక్ష్మి పేరుకి దగ్గట్టే ఎంత లక్షణంగా ఉందో ఆమె పద్దతులు కూడా అంతే. ఈ ఇద్దరికీ పెళ్లి అయితే ఎలా ఉంటుంది.. వాళ్ల జీవితం ఎలా ఉంటుంది అన్నదే ఈ ‘పెళ్లైన కొత్తలో’ వెబ్ సిరీస్. థియేటర్స్‌లో సినిమాలేం లేవు.. అసలు మళ్లీ థియేటర్స్ సినిమాలతో ఎప్పుడు కళకళలాడుతాయో.. ఫ్యాన్స్ హంగామా ఎప్పుడు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఈ సందర్భంలో చాలా మంది కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వేటలో పడ్డారు. తాజాగా యూట్యూబ్‌లో ‘పెళ్లైన కొత్తలో’ అనే రొమాంటిక్ వెబ్ సిరీస్ లక్షల వ్యూస్ సాధిస్తూ అదరహో అనిపిస్తుంది. సీతా మహలక్ష్మి, సురేష్ అన్విత్ జంటగా నటించిన ఈ ‘పెళ్లైన కొత్తలో’ వెబ్ సిరీస్ మోస్ట్ రొమాంటిక్‌గా ఉంది. శ్రీవిద్య కొర్రపాటి రచన, దర్శకత్వంలో వచ్చి ఈ వెబ్ సిరీస్ పార్ట్ 1ను 15.36 నిమిషాల నిడివితో విడుదల చేశారు. ఫస్ట్ షాట్ నుంచి పూర్తిగా పెళ్లి మూడ్‌లోకి తీసుకుపోతూ తరువాత జరిగే తంతుని చాలా రియలిస్ట్‌గా రొమాంటిక్‌గా చూపించారు డెరెక్టర్ శ్రీ విద్య. ఎలాంటి అశ్లీలత, అసభ్య పదజాలం వాడకుండా రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకుని వెళ్లారు. తొలి షాట్‌లో మంచపై పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బట్టలు పడుతుంటే రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. అనంతరం శోభనం గదిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉండటం.. పెళ్లి కూతురు పాల గ్లాస్‌తో రావడం రొటీన్‌గా ఉన్నా.. వచ్చిన తరువాత ఆ ఇద్దరి మధ్య సంభాషణ ఆలోచింపచేసే విధంగా ఉంది. ఒకర్నొకరు అర్థం చేసుకోవాలి అంటే ముందే పరిచయం ఉండాలన్న నిబంధనను బ్రేక్ చేసేలా హీరోయిన్ మహాలక్షి చెప్పే చెప్పే డైలాగ్ యూత్‌కి కనెక్ట్ అయ్యేలా అనిపించాయి. ఇక శోభనం గదిలో కొత్త జంట మధ్య సరసాలు.. ఆ మరుసటి రోజు రాత్రి కార్యంపై ఇద్దరి మధ్య ముచ్చట్లు కొత్త పెళ్లి కూతురు సిగ్గుమొగ్గలు.. పెళ్లి కొడుకు కొంటె చేష్టలు అన్నీ గిలిగింతలు పెట్టే విధంగా ఉన్నాయి. ఇక బయటకు వెళ్దాం అని భార్యతో చెప్పిన తరువాత నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వు అప్పుడు కూడా నువ్ బయటకు వెళ్దాం అంటూ ఆమెతో రొమాన్స్ చేసే సీన్ ఒళ్లు జివ్వుమనేలే చేస్తుంది. ఇంకా చెప్పండం ఎందుకులే కాని మీరూ చూసేయండి ఈ రొమాంటిక్ వెబ్ సిరీస్ ‘పెళ్లైన కొత్తలో’.. ఖచ్చితంగా మీ పెళ్లి నాటి జ్ఞాపకాలను మాత్రం గుర్తుచేస్తుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XbAMUH
No comments:
Post a Comment