
ఓ పోర్న్‌స్టార్ సినీ రంగంలో అడుగుపెట్టి వెండితెరపై రాణించడమనేది అంత సులువైన విషయం కాదు. కానీ దాన్ని చేసి చూపించింది మాజీ పోర్న్‌స్టార్ . అప్పటిలా కాకుండా కేవలం అందాల ఆరబోతనే అస్త్రంగా వాడుతూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. పలు ఐటెం సాంగ్స్ చేస్తూ బాలీవుడ్‌లో క్రేజీ స్టార్‌గా మారింది ఈ సెక్సీ బ్యూటీ. ప్రస్తుతం ఉన్న హోమ్ క్వారంటైన్ పీరియడ్‌లో తన భర్త డానియల్ వెబర్, ముగ్గురు పిల్లలతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది సన్నీ. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన సన్నీలియోన్ తన దత్త పుత్రిక నిషాతో కలిసి అందమైన వీడియోతో అభిమానులను పలకరించింది. తల్లీకూతుళ్ళిద్దరూ గులాబీ పూలతో డిజైన్ చేసిన కిరీటాన్ని పెట్టుకొని అందరినీ ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన స్మాల్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సన్నీలియోన్.. 'నిషా చాలా చాలా అందంగా ఉంది. నేను చాలా లక్కీ మమ్మీని..' అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ 'సో క్యూట్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Also Read: అంతకుముందు కరోనాపై అవగాహన పెంపొందిస్తూ సన్నీలియోన్, ఆమె భర్త డానియల్ వెబర్ మాస్కులు ధరించి వాటి అవసరాన్ని గురించి తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘కరోనా వైరస్ మిమ్మల్ని ప్రభావితం చేయకుండా సురక్షితంగా ఉండండి’’ అని వారిద్దరూ విజ్ఞప్తి చేశారు. ఓ మనిషి నుంచి మరో మనిషి ఈజీగా అంటుకునే కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 29 లక్షల మందిని, ఇండియాలో 27 వేలమందిని కాటేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zBApJr
No comments:
Post a Comment