ఎట్టకేలకు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కరోనా కోసం విరాళం ప్రకటించాడు. రూ. కోటి 30 లక్షల సాయం చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అంతేకాదు కరోనా సమయంలో సాయం చేసేందుకు రెండు ఛారిటీ సంస్థలను కూడా ఏర్పాటు చేశాడు. కరోన విషయంలో తనదైన స్టైల్లో సాయం అందిస్తూ... తనకుంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నాడు. ‘ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్’(టి డి ఎఫ్), మిడిల్ క్లాస్ ఫౌండేషన్ (ఎం సి ఎఫ్) అనే రెండు ఛారిటీ విభాగాలను విజయ్ దేవరకొండ ప్రారంభించాడు. కోటి రూయాలతో మొదలైన టిడిఎఫ్ ఫౌండేషన్ తరపున కొందరు విద్యార్థులను ఎంపిక చేసిన వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతానని ఈ గీతా గోవిందం చెబుతున్నారు. అంతేకాదు తన జీవితంలో కనీసం ఒక లక్ష మందికి ఉద్యోగాలను తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట. ఇక వాటితో పాటు.. సంక్షోభ సమయంలో డబ్బుల్లేక నిత్యావసరాలు కూడా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి ప్రజల కోసం కూడా విజయ్ ముందుకు వచ్చాడు. వారి కోసం మిడిల్ క్లాస్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. రూ. 25లక్షలతో దీనిని ప్రారంభించాడుజ ఈ ఫౌండేషన్ ముఖ్య ద్యేయం కనీస అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నవారికి కనీస అవసరాలు అందేలా చూడటం. ఒకప్పుడు తనది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయేనని గుర్తు చేశాడు విజయ్ దేవరకొండ. అందుకే మధ్యతరగతి కష్టాలు తనకు తెలుసన్నాడు. ఎవరికైనా నిత్యావసరాలు అవసరం అయితే https://ift.tt/2KMvDLv లాగిన్ అయి తమ డిటైల్స్ నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తారట. దాదాపు 2000 కుటుంబాల అవసరాలని ఎం.సి.ఎఫ్ ట్రస్ట్ తీర్చే ఉద్ధేశంగా పెట్టుకున్నట్టు విజయ్ తెలిపాడు. అయితే ఇది దానం ఏ మాత్రం కాదని సాయం అని అర్జున్ రెడ్డి హీరో చెబుతున్నాడు. ఈ ఫౌండేషన్ ద్వారా సాయం పొందినవారు ఎప్పుడైనా తిరిగి ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చని కూడా చెబుతున్నారు. అలా వచ్చిన డబ్బుల్ని వేరే మంచి కార్యక్రమాల కోసం వాడుతామని విజయ్ తెలిపాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/354JOEI
No comments:
Post a Comment