బుల్లితెరపై తనదైన పంచులేస్తూ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసే పెళ్ళికి రెడీ అయ్యాడనే వార్తలు ఊపందుకున్నాయి. జబర్దస్త్ కమెడియన్‌గా భారీ పాపులారిటీ కూడగట్టుకున్న ఆయన ఈ మధ్య యాంకర్ అవతారమెత్తి తోటి లేడీ యాంకర్‌ని 'ఢీ' కొడుతున్నాడు. ఆమెతో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తూ యమ కిక్కిస్తున్నాడు. వెండితెరపై కూడా తనదైన కామెడీ పండిస్తూ సూపర్ క్రేజ్ కొట్టేశాడు. అలాంటి ఈ హైపర్ పంచ్ పరేషానీ ఇక పెళ్ళికొడుకు కాబోతుండటం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. జబర్దస్త్ తెరపై ఎన్నో ఎపిసోడ్స్ చేసి తనదైన పంచులేస్తూ యాంకర్ అనసూయను నానా తిప్పలు పెట్టిన ఘనత మనోడిదే. దీంతో అనసూయ- హైపర్ జోడీకి మంచి గుర్తింపు లభించడమే గాక, వాళ్ళు కనిపిస్తేనే చాలు హుషారు ఉరకలేసే స్టేజీకి వెళ్ళింది ఆ కాంబినేషన్. దీంతో హైపర్ ఆదికి అనసూయ అంటే ఇష్టం అనే రూమర్స్ బయటకొచ్చాయి. కానీ అప్పటికే అనసూయకు పెళ్ళై పోవడం కారణంగా ఆ రూమర్స్ పెద్దగా క్లిక్ కాలేదు. ఇక ఎప్పుడైతే హైపర్ ఆది 'ఢీ' షో స్టేజీపై యాంకర్‌గా అడుగుపెట్టాడో అప్పటినుంచి మరో రూమర్ చక్కర్లుకొట్టడం ప్రారంభించింది. 'ఢీ' షో వేదికపై లేడీ యాంకర్ వర్షిణితో మనోడు చేసే యవ్వారం చూసి అంతా షాక్ అయ్యారు. రొమాన్స్ చేయడంలో మా ఇద్దరికీ సాటిలేరెవ్వరూ అన్నట్లుగా రెచ్చిపోయింది హైపర్ ఆది- వర్షిణి జోడీ. దీంతో వీళ్లిద్దరి అంశం హాట్ టాపిక్ అయి ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని, ఇద్దరూ త్వరలోనే పెళ్లికూడా చేసుకోబోతున్నారనే వార్తలు బలంగా వినిపించాయి. ఇటీవలే వీటిని వర్షిణి, హైపర్ ఆది ఇద్దరూ ఖండించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖాయమైందంటూ మరో వార్త తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. పెద్దలు చూసిన సంబంధం వైపే హైపర్ ఆది మొగ్గుచూపాడని, తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే మనోడు పెళ్లాడబోతున్నాడని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన అమ్మాయితో ఇప్పటికే పెళ్లి చూపుల కార్యక్రమం ఫినిష్ అయిందని, ఇరు కుటుంబాల అంగీకారం జరగడంతో వచ్చే ఏడాది వేసవిలో పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఇంతటితో అయినా హైపర్ పెళ్లి వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లేనా అనేది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VVoyNN
No comments:
Post a Comment