స్టార్ హీరోగా భారీ పాపులారిటీ ఉన్న బిజినెస్‌మేన్‌గా మారడమేంటి? ఇదెక్కడి ట్విస్ట్ అనుకుంటున్నారు కదూ!. అవును మీరు చూసింది నిజమే.. కాకపోతే రియల్ బిజినెస్‌మేన్ కాదు, రీల్ బిజినెస్‌మేన్. ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా కోసం బడా బిజినెస్‌మేన్ అవతారం ఎత్తబోతున్నారట ఎన్టీఆర్. ఈ మేరకు మాటల మాంత్రికుడు పక్కా ప్లాన్ రెడీ చేశారని సినీ వర్గాల సమాచారం. ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా 'అల వైకుంఠపురములో' రూపంలో భారీ విజయాన్ని నమోదు చేసి రికార్డులను తిరగరాసిన త్రివిక్రమ్.. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం తన కలానికి పదును పెట్టారట. తన తదుపరి సినిమాగా ఎన్టీఆర్‌తో రూపొందించనున్న సినిమా స్క్రిప్ట్ వర్క్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి కథను వైవిధ్యభరితంగా మలుస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనుందనే టాక్ బయటకొచ్చింది. కాకపోతే ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ మాత్రం చాలా డిఫెరెంట్ అని తెలుస్తోంది. లేటెస్ట్‌గా అందిన సమాచారం మేరకు ఎన్టీఆర్‌ని బడా బిజినెస్‌మేన్‌గా చూపించేలా త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని తెలిసింది. అంతేకాదు ఈ మూవీలో ఎన్టీఆర్ లుక్ కూడా గతంలో ఎన్నడూ చుడని విధంగా ఉండాలని మాటల మాంత్రికుడు ఓ అంచనాకు వచ్చారట. అందుకు తగ్గట్టుగానే స్క్రిప్ట్ పనులు పూర్తిచేస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. రాజకీయాల నేపథ్యం కొనసాగిస్తూనే నేటి యువతరానికి అవసరమయ్యే అంశాలను మేళవిస్తూ ఈ కథను రాసుకున్నారట త్రివిక్రమ్. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతిత్వరలో తెలియనున్నాయి. Also Read: ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR మూవీలో నటిస్తున్నారు ఎన్టీఆర్. రామ్ చరణ్‌తో కలిసి ఈ భారీ మల్టీస్టారర్‌లో భాగమవుతున్నారు. షూటింగ్ చివరి దశలో కరోనా కారణంగా తదుపరి షెడ్యూల్ వాయిదా వేశారు జక్కన్న. ఇందులో చేస్తూనే త్రివిక్రమ్ సెట్స్ మీదకు వచ్చేలా ఎన్టీఆర్ సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/350dumw
No comments:
Post a Comment