'పుష్ప' నుంచి విజయ్ సేతుపతి అవుట్.. అసలు కారణం తెలిస్తే షాక్!!

'రంగస్థలం' లాంటి భారీ బ్లాక్‌బస్టర్ సాధించిన సుకుమార్.. ఈ సారి అంతకుమించి అన్నట్లుగా అడుగులేస్తున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా '' సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే కొద్దిభాగం షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్, లాక్‌డౌన్ కారణంగా కొంత విరామం తీసుకుంది. అయితే అనూహ్యంగా ఈ సినిమా నుంచి తమిళ హీరో విజయ్ సేతుపతి తప్పుకున్నారనే వార్త అభిమానులను నిరాశ పర్చింది. అందుకు కారణం ఏమై ఉంటుందా? అనే కోణంలో అన్వేషిస్తుండగా.. తాజాగా అసలు విషయం బయటకొచ్చింది. ప్యాన్ ఇండియా మూవీగా 'పుష్ప' చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు సుకుమార్. ఐదు భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే పలు భాషల్లోని ఫేమస్ నటులను తీసుకున్నారు. ఈ క్రమంలో తమిళ నటుడు విజయ్ సేతుపతిని అల్లు అర్జున్‌తో ఢీకొట్టే స్ట్రాంగ్ విలన్ రోల్‌లో చూపించాలని భావించారు. కానీ ఆయన ఈ రోల్ నుంచి తప్పుకున్నారు. దానికి కారణం కూడా చిత్ర యూనిట్‌తో చెప్పారట విజయ్ సేతుపతి. 'పుష్ప' మూవీలో తాను విలన్ రోల్ చేస్తా కానీ ఒక్క తమిళ భాషలో మినహా అన్నిభాషల్లో నటిస్తానని చెప్పారట. కోలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న ఆయన తమిళ వర్షన్‌లో మాత్రం విలన్ రోల్ చేయలేనని, ఆ ఒక్క భాషలో వేరే నటుడిని చూసుకోవాలని అన్నారట. దీంతో.. ఏకకాలంలో ఐదు భాషల్లో రూపొందుతుంటే కేవలం ఒక్క భాష కోసం మరో విలన్ అంటే కష్టమని భావించిన సుకుమార్, విలన్ రోల్ కోసం వేరే నటుడిని వెతికే పనిలో పడ్డారని తెలిసింది. అన్ని భాషల్లోనూ ఒకే విలన్ ఉండాలని ఫైనల్ అయిన సుక్కు.. విజయ్ సేతుపతి స్థానంలో కన్నడ యాక్టర్ ధనుంజయ్‌ని తీసుకోనున్నట్లు ఇన్‌సైడ్ టాక్. ఈ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ పూర్తి మాస్ రోల్ పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన 'పుష్ప' ఫస్ట్ లుక్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3amkg72

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts