మాటల మాంత్రికుడు Trivikram Srinivas బర్త్‌ డే స్పెషల్‌

ఆయనో మాటల మరాఠి, చమత్కారాల చక్రవర్తి, ఆయన మాటలంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం, ఆయన కథలంటే మరీ ఇష్టం. అందుకే.. చేసింది తక్కువ సినిమాలే అయిన టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌లో స్థానం సంపాదించుకున్నారు ఆ మాటల మాంత్రికుడు. ఆయనే ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ. ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఈ పేరు మరెవరిదో కాదు. తెలుగు వారి వ్యవహారికి భాషలో భాగమైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌దే. తెలుగు సినిమా దర్శకునిగా ఎదిగి. ఖరీదైన కమర్షియల్ వెండితెరను తన మాటలతో మేల్కొలిపిన త్రివిక్రమ్ రచయితగా స్వయంవరంతో టాలీవుడ్లో కి ఎంట్రీ ఇచ్చారు. మొదటిసినిమా నుంచే తన పెన్ పవర్, తన ఫన్ పవర్ చూపించి త్రివిక్రమార్క్ డైలాగ్స్ ఎలా ఉంటాయో అందరికీ హింట్‌ ఇచ్చారు. అక్కడినుంచి త్రివిక్రమ్ మాటల గారడీ మొదలైంది. Also Read: నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువునాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు, జై చిరంజీవా లాంటి సినిమాలతో డైలాగ్స్ ఇలారాయాలి. పంచ్ లు ఇలాపేలాలి అనేలా యువ రచయితలకు దిశానిర్దేశం చేసారు. అందరికీ అర్ధమయ్యేలా మీనింగ్‌ ఫుల్ డైలాగ్స్‌ రాయటం ఆయన స్టైల్‌. పేజీలకు పేజీల డైలాగ్స్ అవసరంలేదు. పేరాలకు పేరాలు రాసేసి పేల్చేయనవసరంలేదు. జస్ట్ వన్ లైన్ పంచింగ్ తో అందరినీ అలరించటం త్రివిక్రమ్‌ మార్క్‌. అందుకే అతి తక్కువ టైమ్ లో టాలీవుడ్ లో స్టార్ రైటర్ అయ్యారు త్రివిక్రమ్. ఇదంతా ఆయన రాసిన డైలాగ్స్ మత్తువల్ల, గమ్మత్తు వల్లే సాధ్యమైంది. రైటర్స్ డైరెక్టర్స్ అవ్వడం చాలా కామన్. కథను ఎలా మలుపుతిప్పాలి, కథనానికి ఏ మలుపుదగ్గర మెలికపెట్టాలి?, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంత ఎఫిక్టివ్ గా ఉండాలి, హీరోయిజాన్ని ఎంత హైప్ కి తీసుకెళ్ళాలి ఇలాంటి కమర్షియల్‌ ఫార్ములాలన్ని రైటరే ఆలోచిస్తాడు. ఆ ఆలోచనల్ని దర్శకులకు మరింత అందంగా తెర మీద చూపిస్తారు. ఇక రైటరే దర్శకుడు కూడా అయితే. ఆ పని ఇంకా ఈజీ అవుతుంది. అందుకే త్రివిక్రమ్ అనే రైటర్, డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. `నువ్వే నువ్వే` అనే ప్రేమకథకు వినోదం సెంటిమెంట్‌ జోడించి త్రివిక్రమ్ చేసిన ప్రయోగం సూపర్‌ హిట్‌ అయ్యింది. Also Read: తరువాత `అతడు`తో త్రివిక్రమ్ అంటే అందరికీ ఓ బెంచ్‌ మార్క్‌ ఏర్పడింది. అద్భుతమైన టేకింగ్‌తో, ట్విస్ట్‌లతో మహేష్ బాబులో హై ఓల్టేజ్ హీరోయిజాన్ని చూపించి, హాలీవుడ్ యాక్షన్ సినిమాల రేంజ్‌లో వావ్‌ అనిపించారు త్రివిక్రమ్. అతడు తరువాత దర్శకుడిగా త్రివిక్రమ్ రేంజ్‌ మారిపోయింది. కనీసం మీడియం రేంజ్‌ హీరోలతో కూడా త్రివిక్రమ్ సినిమా చేయలేందటే ఆయన సినిమాలే ఏం రేంజ్ లో బిజినెస్‌ చేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. హిట్‌ ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా త్రివిక్రమ్‌ భారీ చిత్రాలతో అలరిస్తున్నాడు. మహేష్ బాబుతో రెండు, అల్లు అర్జున్‌తో రెండు, పవన్ తో మూడు సినిమాలు చేసిన త్రివిక్రమ్‌, ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా మూడో సినిమా చేస్తున్నాడు. మరోసారి తనదైన స్టైల్‌లో సినిమాను ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్‌. ఇలా టాప్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్న మాటల మాంత్రికుడు మనల్ని మరింత కాలం తన మాటలతో, సినిమాలతో అలరించాలని ఆశిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qsbkMg

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts