క్రికెట్ గాడ్ సచిన్ తెందుల్కర్ ట్వీట్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ గాయని . కొన్ని రోజులుగా మ్యూజిక్ కంపోజర్ అను మాలిక్‌పై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచారు సోనా. సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్‌కు అను జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు ఈ షోకు సోనా కూడా జడ్జ్‌గా వ్యవహరించేవారు. అయితే తన కెరీర్ తొలినాళ్లలో అను తనను లైంగికంగా వేధించాడని సోనా ఏడాది క్రితం ఆరోపణలు చేశారు. దాంతో షో నిర్వాహకులు అనును తొలగించారు. కొంతకాలం తర్వాత సోనాను కూడా తొలగించారు. ఏడాది తర్వాత అనును మళ్లీ షోలోకి ఆహ్వానించి జడ్జ్‌గా కూర్చోబెట్టారు. దీనిపై అసహనం వ్యక్తం చేశారు సోనా. ఇండియాలో మరో నిర్భయ ఘటన జరిగితే తప్ప ఇలాంటి వారు బాగుపడరని అన్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఐడల్ షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్‌ను పొగుడుతూ ట్వీట్ చేశారు సచిత్ తెందుల్కర్. ‘ఈ కంటెస్టెంట్ పాటలు, అతని జీవిత కథ నా మనసును తాకాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వీరంతా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారన్న నమ్మకం నాకుంది’ అని సచిన్ ట్వీట్ చేశారు. దీనిపై సోనా మొహాపాత్ర స్పందించారు. ‘సచిన్ సర్.. మీకు మీటూ గురించి ఏమీ తెలీదా? మీరు మెచ్చుకుంటున్న షోలో అను మాలిక్ అనే కామాంధుడు ఉన్నాడు. మీరు ఎప్పుడూ ఆ షోలో పాల్గొనేవారినే మెచ్చుకుంటారా? అను మాలిక్ వల్ల మాలాగా ఇబ్బందులు పడిన ఆడవాళ్ల గురించి అస్సలు పట్టించుకోరా?’ అని ప్రశ్నించింది సోనా. అయితే ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడో ఏమో సచిన్ మాత్రం దీనిపై స్పందించలేదు. అను మాలిక్ గురించి మరో షాకింగ్ విషయం బయటికి వచ్చింది. ఇటీవల గాయని సోనా మొహాపాత్ర అతనిపై మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేహా భాసిన్ అనే మరో పాపులర్ సింగర్ అను తనతో ప్రవర్తించిన తీరును సోషల్ మీడియాలో బట్టబయలు చేసింది. అతడు కామాంధుడని తనని కూడా వదిలిపెట్టలేదని తిట్టిపోసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PCzHl8
No comments:
Post a Comment