ఎట్టకేలకు పెళ్లి గురించి నోరు విప్పారు బాలీవుడ్ నటి . నటుడు అర్జున్ కపూర్‌తో మలైకా కొంతకాలంగా డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇద్దరూ పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారని చాలా మంది అనుకున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని మలైకా, అర్జున్ కొట్టిపారేశారు. అయితే అర్జున్‌ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని తాజాగా మలైకా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘అర్జున్‌ని తప్పకుండా పెళ్లి చేసుకుంటా. నా పెళ్లి ఓ డ్రీమ్‌లా ఉండాలి. పెళ్లంటూ జరిగితే కచ్చితంగా బీచ్ వద్దే జరుగుతుంది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఎల్లీ సాబ్ తెలుపు రంగు గౌను వేసుకుంటాను. నా ప్రాణ స్నేహితురాళ్లు వధువు తరఫు వారిగా ఉంటారు. నా క్లోజ్ ఫ్రెండ్ వాబిజ్ మెహతా తప్పకుండా నా పక్కనే ఉండాలి. ఎందుకంటే ఆమె బెస్ట్ వుమెన్. నాకు ఫొటోలు తీయడం రాదని అర్జున్ ఫీలింగ్. అర్జున్ నా ఫొటోలు బాగా తీస్తాడు కానీ నాకు ఫొటోలు తీయడం రాదని ఎప్పుడూ తిడుతూ ఉంటాడు’ అని వెల్లడించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌తో 20 ఏళ్ల క్రితం మలైకా పెళ్లైంది. వీరికి పదహారేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మలైకా అర్జున్‌తో డేటింగ్లో ఉన్నారు. అర్బాజ్ జార్జియానా అనే మోడల్‌తో డేటింగ్లో ఉన్నారు. కాకపోతే మలైకా కంటే అర్జున్ పదేళ్ల చిన్నవాడు. తన తమ్ముడి కుటుంబంలో నిప్పులు పోశాడని ఇప్పటికీ సల్మాన్‌కి అర్జున్ అంటే కోపం. చాలా సార్లు సల్మాన్ కుటుంబంతో పెట్టుకోవద్దని అర్జున్ తండ్రి బోనీ కపూర్ ఎన్నో సార్లు హెచ్చరించారు కూడా. కానీ అర్జున్ మాత్రం అస్సలు వినలేదు. ఎవరేమనుకున్నా తాను మలైకాను మాత్రం వదలనని బెట్టు చేస్తున్నాడు. చూద్దాం.. వీరి రిలేషన్షిప్ ఎంతకాలం నిలుస్తుందో. ఇక మలైకా ప్రొఫెషన్ విషయానికొస్తే ఆమె బాలీవుడ్లో కేవలం ఐటెం సాంగ్స్‌కే పరిమితం అయ్యారు. ‘ఛయ్య ఛయ్యా’ పాటతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న మలైకా ఆ తర్వాత ఎన్నో ఐటెం సాంగ్స్‌లో మెరిశారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘కెవ్వు కేక’ పాటలో నటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2oMTUtn
No comments:
Post a Comment