మెలొడీ క్వీన్ లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమించిందట. సోమవారం అర్థరాత్రి 1.30 సమయంలో ఊపిరి తీసుకోవడంలో ఆమె ఇబ్బందికి గురవడంతో వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆమెను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కొన్ని రోజుల క్రితం లతకు నుమోనియా సోకింది. మంగళవారం తెల్లవారుజామున ఆమె పరిస్థితి విషమించడంతో వెంటనే ఐసీయూకి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం లతకు నుమోనియా వచ్చిందట. ఇప్పటివరకు లత ఆరోగ్యం కొంచెం కూడా మెరుగుపడలేదని ఆమె చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ తెలిపారు. అయితే లత కుటుంబీకులు మాత్రం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని అంటున్నారు. ఆమె త్వరలో కోలుకుంటారని, కొద్దిరోజుల్లో డిశ్చార్జ్ అవనున్నారని లత సోదరి ఉష తెలిపారు. మరోపక్క లత అభిమానులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. తన కెరీర్‌లో దాదాపు 25వేలకు పైగా సోలో పాటలు పాడి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారు లతా మంగేష్కర్. ఆమెను అంతా నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. భారత ప్రభుత్వం లతను పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇప్పటికీ ఆమె పాటలకు ఎంతో ఆదరణ ఉంది. ప్రస్తుతం లత వయసు 90. అయితే కొన్నేళ్ల క్రితం సినిమాలకు పాటలు పాడటం మానేశారు లత. కేవలం భక్తి పాటలను మాత్రమే పాడుతున్నారు. ఇందుకు ఆమె ఆరోగ్యం సహకరించకపోవడం ఒక కారణమైతే, ఇప్పుడు సినిమాల్లో వస్తున్న పాటలన్నీ బూతు పదాలతో నిండిపోయి ఉన్నాయని అలాంటి పాటలను తాను పాడనని వెల్లడించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36RwYu1
No comments:
Post a Comment