ప్రముఖ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు కాగా రాజశేఖర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రమాద సమయంలో కారులో తాను ఒక్కడే ఉన్నట్టుగా వెల్లడించారు రాజశేఖర్. Also Read: ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ `మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు. Also Read: అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాను. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు` అని తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qNpQ1g
No comments:
Post a Comment