Shyam Singha Roy 8 Days Worldwide Collections

Shyam Singha Roy 8 Days Worldwide Collections
Shyam Singha Roy 8 Days Worldwide Collections

Shyam Singha Roy Collections: Natural Star Nani, Krithi Shetty, Sai Pallavi  starrer Shyam Singha Roy, has minted Rs 21.12 Cr shares at the Worldwide box office in 8 days.

The area-wise break up of  8 days Collections are as follows:

Nizam : Rs 7.72 Cr
Ceeded : Rs 2.04 Cr
UA : Rs 1.73 Cr
East : Rs 82 L
West : Rs 66 L
Guntur : Rs 96 L
Krishna :  Rs 75 L
Nellore : Rs 51 L
AP-TS Total  Shyam Singha Roy Collections: Rs 15.19 CR ( Rs 25.73 Cr Gross)
Ka+ROI : Rs 2.53 Cr
OS : Rs 3.40 Cr
Total WW Collections :  Rs 21.12 Cr ( Rs 37.35 Cr Gross)

Shyam Singha Roy 8th Day Collection

Nizam : Rs 12 L
Ceeded : Rs 3 L
UA : Rs 3 L
East : Rs 2 L
West : Rs 2 L
Guntur : Rs 2 L
Krishna :  Rs 2 L
Nellore : Rs 1 L
AP/TS Total: Rs 27 L ( Rs 0.45 L Gross)

Day Wise AP/TS Box office Collections
Day 1 : Rs 4.17 Cr

Day 2 : Rs 4.38 Cr

Day 3 : Rs 3.52 Cr

Day 4:  Rs 1.38 Cr

 Day 5: Rs 74 L

 Day 6 : Rs 42 L

 Day 7 : Rs 31 L

Day 8 :Rs  27 L

Telugu States AP/TS Total  Collections: Rs 15.19  Cr ( Rs 25.73 Cr Gross)

Also Read:

Shyam Singha Roy 7 Days Worldwide Collections

5 days collections of Shyam Singha Roy

Shyam Singha Roy 6 Days Worldwide Collections



from TOPSTORIES – Tollywood https://ift.tt/3eVW00B

మెగా, నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ .. RRR వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే.. సోషల్ మీడియా వైరల్ అవుతున్న వార్త

ఇదెక్క‌డి క‌రోనా వైరస్ బాబూ.. మ‌నల్ని ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌డం లేదు. మ‌న ప‌నుల‌ను మ‌నం నింపాదిగా అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం చేసుకోలేక‌పోతున్నామ‌ని ప్ర‌పంచ‌మంతా అనుకుంటున్న మాట‌. నిజ‌మే మ‌రి!. సినీ ఇండ‌స్ట్రీ విష‌యానికి వ‌స్తే.. నూటికి రెండు వంద‌ల శాతం ఇది నిజ‌మ‌ని అంద‌రూ అంటారు. ఎందుకంటే భారీ చిత్రాలు, మీడియం బ‌డ్జెట్ చిత్రాలు, చిన్న బ‌డ్జెట్ చిత్రాలు ఇలా అన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఈ కోవ‌లో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన మూవీ వాయిదా ప‌డుతుంద‌ని వార్త‌లు బ‌లంగా సినీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి RRR..2020 జూలై 30న విడుద‌ల కావాల్సిన చిత్రం. అప్ప‌టి నుంచి వాయిదా ప‌డుతూనే వ‌స్తుంది. చివ‌ర‌కు జ‌న‌వ‌రి 7, 2022న RRR ను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌ని అంద‌రూ ఫిక్స్ అయ్యారు. పెద్ద రేంజ్‌లో రూపొందిన చిత్రం. రాజ‌మౌళి తెరకెక్కించిన చిత్రం కావ‌డంతో హీరోలంద‌రూ RRR సినిమాకు దారి ఇచ్చారు. సినిమా యూనిట్ కూడా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక విడుద‌ల‌కు ప‌ది రోజులు కూడా లేవు. మ‌న అభిమాన హీరోల‌ను వెండితెర‌పై చూడొచ్చున‌ని ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నంద‌మూరి ఫ్యాన్స్ సంబర‌ప‌డ్డారు. కానీ.. ఇప్పుడు వారికి నిరాశ ఎదురుకాక త‌ప్పేలా లేదు. అందుకు కార‌ణం కోవిడ్ మ‌ళ్లీ త‌న పంజా విసర‌డం ప్రారంభించింది. ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టంతో ప‌రిస్థితులు అదుపు త‌ప్ప‌కుండా ఉండ‌టానికి ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధిస్తూ వ‌స్తున్నాయి. అందులో భాగంగా థియేట‌ర్స్‌ను త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుని పూర్తిగా కాకుండా 50 శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ చేసుకోమ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఢిల్లీలో లాక్డౌన్ విధించారు. మ‌హారాష్ట్ర‌, యూపీ వంటి రాష్ట్రాల్లోనూ అదే ప‌రిస్థితి. థియేట‌ర్స్ విష‌యానికి వ‌స్తే 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేట‌ర్స్‌ను ర‌న్ చేయ‌వ‌చ్చున‌ని అన్నారు. ఇప్పుడు ద‌క్షిణాదిన త‌మిళ‌నాడులో కూడా లాక్ డౌన్ పెట్టారు. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్ అంక్ష‌లు కొన‌సాగుతాయి. థియేట‌ర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ చేసుకోవ‌చ్చున‌ని రూల్స్ పెట్టేశారు. ఇలాంటి క‌ఠిన ప‌రిస్థితుల్లో RRR సినిమాను విడుద‌ల చేస్తే డిస్ట్రిబ్యూట‌ర్స్ చాలా న‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. దీంతో చిత్ర యూనిట్‌, మేక‌ర్స్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌నలు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే దాదాపు RRR రిలీజ్‌ను వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యార‌ట‌. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత జూన్‌లో RRR ను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Hi10bU

Tollywood.net wish you a Happy New Year 2022

Tollywood.net wish you a Happy New Year 2022
Tollywood.net wish you a Happy New Year 2022

www.tollyood.net wishes you a very happy and prosperous New Year to our reader.  The year 2021 was a tough one with the second wave of the COVID-19 pandemic hitting us hard and claiming thousands of lives. Because of this, the upcoming year becomes even more important since it is a time for us to thank our loved ones for their presence in our lives.

Your support and encouragement have made tollywood.net one of the top and most trusted resources for  the Film News. It covers all the breaking news of the film Industry, Reviews, Polls, and latest updates about the celebrities.

A promising year awaits you as you turn the leaf for another eventful chapter of your life. With 365 days in offing, hidden opportunities await you in New Year 2022. It is the perfect occasion to celebrate friendships and all the good things in life.

It is also a time to reminiscence the year that has gone by and how to make the new one better.



from NEWS – Tollywood https://ift.tt/3sOJ3hc

ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్‌.. ఊర‌మాస్ లుక్‌లో చిరంజీవి.. ‘భోళా శంక‌ర్’ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

మెగాస్టార్ తన ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులకు కొత్త సంవత్సరం ట్రీట్‌ను ఇచ్చారు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. లిస్టులో భోళా శంక‌ర్ సినిమా కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా నుంచి కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. మోష‌న్ పోస్ట‌ర్‌లో చిరంజీవి యంగ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నారు. చేతికి క‌డియం, తాయెత్తులు క‌ట్టుకుని ప‌క్కా ఊర‌మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో రివేంజ్ డ్రామా కూడా న‌డుస్తుంటుంది. చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో ప్ర‌ముఖ హీరోయిన్ కీర్తి సురేష్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా క‌నిపించ‌నుంది. కోల్‌క‌త్తా బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. ఇందులో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అందులో ఓ మాస్ లుక్‌కి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ను కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా త‌యారు చేసి చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌కు కాబోయే భ‌ర్త పాత్ర‌లో హీరో నాగ‌శౌర్య క‌నిపించ‌నున్నార‌నే వార్త‌లు కూడా రీసెంట్‌గా వినిపించాయి. త‌మిళ చిత్రం వేదాళంకు ఇది రీమేక్‌. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా పేరుతో రీమేక్ చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేస్తామని ఇప్ప‌టికే నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. మ‌రో వైపు బాబీ డైరెక్ష‌న్‌లోనూ రూపొందుతోన్న చిత్రంలో చిరంజీవి హీరోగా న‌టిస్తున్నారు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న గాడ్ ఫాద‌ర్ షూటింగ్ సెట్స్‌పై ఉంది. ఇవ‌న్నీ కాకుండా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌డానికి చిరం.జీవి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sOcfF5

Tollywood.net wish you a Happy New Year 2022

Tollywood.net wish you a Happy New Year 2022
Tollywood.net wish you a Happy New Year 2022

www.tollyood.net wishes you a very happy and prosperous New Year to our reader.  The year 2021 was a tough one with the second wave of the COVID-19 pandemic hitting us hard and claiming thousands of lives. Because of this, the upcoming year becomes even more important since it is a time for us to thank our loved ones for their presence in our lives.

Your support and encouragement have made tollywood.net one of the top and most trusted resources for  the Film News. It covers all the breaking news of the film Industry, Reviews, Polls, and latest updates about the celebrities.

A promising year awaits you as you turn the leaf for another eventful chapter of your life. With 365 days in offing, hidden opportunities await you in New Year 2022. It is the perfect occasion to celebrate friendships and all the good things in life.

It is also a time to reminiscence the year that has gone by and how to make the new one better.



from TOPSTORIES – Tollywood https://ift.tt/3sOJ3hc

నిర్మాత‌కు అండ‌గా నాని.. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో డేరింగ్ స్టెప్‌.. మిగ‌తా హీరోలు చేస్తారా ?

నేచుర‌ల్ స్టార్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్మస్ సందర్భంగా సినిమా విడుదలైంది. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కింది. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు దాదాపు అరవై కోట్లకు పైగానే ఖర్చు పెట్టినట్లు టాక్. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే వ‌సూళ్ల ప‌రంగా సినిమాకు రూ.22 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఏపీలో నెల‌కొన్న థియేట‌ర్ ప‌రిస్థితులు, త‌గ్గించిన టికెట్ రేట్స్ అన్నింటి కార‌ణంగా శ్యామ్ సింగ‌రాయ్ క‌లెక్ష‌న్స్‌పై ప్ర‌భావాన్ని చూపాయ‌న‌డంలో సందేహం లేదు. శ్యామ్ సింగ‌రాయ్‌ ఇలాంటి ప‌రిస్థితుల్లో విడుద‌లై మంచి టాక్‌తో మంచి వ‌సూళ్ల‌ను సంపాదించుకున్నా, నిర్మాత‌కు ఇబ్బందే క‌దా. ఈ విష‌యాన్ని హీరో నాని గుర్తించారు. ఎందుకంటే ఆయ‌న కూడా ఓ నిర్మాతే మ‌రి. అందుక‌నే ఆయ‌న రెమ్యున‌రేష‌న్‌లో ఎక్కువ భాగాన్ని వెన‌క్కి ఇచ్చేశాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న గుస‌గుస‌ల మేర‌కు నాని తను తీసుకున్న రెమ్యునరేషన్‌లో రూ.5కోట్ల‌ను నిర్మాత‌కు తిరిగి ఇచ్చేశార‌ట‌. రెమ్యున‌రేష‌న్ తీసుకున్న త‌ర్వాత నిర్మాత‌ల‌ను హీరోలు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అలాంటిది నిర్మాత కోసం నాని రెమ్యున‌రేష‌న్‌లో కొంత భాగాన్ని వెన‌క్కి ఇవ్వ‌డం చాలా మంచి విష‌య‌మ‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ఇప్పుడున్న కోవిడ్ ప‌రిస్థితులు, ఏపీలో సినిమా టికెట్ త‌గ్గ‌డం వంటి కార‌ణాల‌తో నిర్మాత‌లు సినిమాలు రిలీజ్ చేయ‌డానికి వెనుకా ముందు అవుతున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో సినిమాను ధైర్యంగా విడుద‌ల చేసిన నిర్మాత‌ల‌కు త‌న వంతు స‌పోర్ట్ అవ‌స‌రం అని భావించి నాని అలా చేశార‌ట. మ‌రి మిగ‌తా హీరోలు కూడా అలా చేస్తారా? అని నాని అభిమాల‌ను వేస్తున్న ప్ర‌శ్న‌. ఓ ర‌కంగా వారు వేస్తున్న ప్ర‌శ్న కూడా నిజ‌మే. ఎందుకంటే ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమా ఇండ‌స్ట్రీ నిల‌బ‌డాలంటే హీరోలు స‌హా అంద‌రూ నిర్మాత‌ల‌కు అండ‌గా నిల‌బ‌డాలి. దేవ‌దాసీ వ్య‌వ‌స్థ‌పై ధైర్యంగా పోరాటం చేసిన వ్య‌క్తి క‌థాంశంతో శ్యామ్ సింగ‌రాయ్ సినిమాను రూపొందించారు. సాయి ప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డోన్నా హీరోయిన్స్‌గా న‌టించారు. రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌కుడు. నిహారిక ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mIGVna

మా నాన్నని మోసం చేశా.. ప్రేమ మైకంలో కళ్ళు మూసుకుపోయి అలా! యాంకర్ లాస్య కన్నీటి పర్యంతం

బుల్లితెర యాంక‌ర్‌గా లాస్యది ఓ ప్రత్యేకమైన జర్నీ. 'సంథింగ్ స్పెషల్' రూపంలో యాంకరింగ్ చేయడంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది లాస్య. అయితే ఆ తర్వాత క్రమంగా బుల్లితెరకు దూరమైన లాస్య తిరిగి ఈ మధ్య కెమెరా ముందుకొస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని త‌నదైన ఆట, మాట‌ తీరుతో అట్రాక్ట్ చేసిన ఆమె.. వీలు కుదిరినప్పుడల్లా స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో తళుక్కుమంటోంది. ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్ 'పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు' షోకి తన భర్తతో సహా విచ్చేసిన లాస్య వేదికపై కన్నీటి పర్యంతమైంది. తాజాగా ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ప్రోమో విడుదల చేయగా.. ఈ వీడియోలో రష్మీ గౌతమ్ డాన్స్ పెర్ఫార్మన్స్, కన్నీళ్లు పెట్టుకున్న సీన్స్ హైలైట్ అయ్యాయి. తన ప్రేమకు తండ్రి నుంచి అంగీకారం లభించకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అమ్మాయిగా రష్మీ గౌతమ్ కనిపించింది. 'నాన్నా.. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే తననే పెళ్లి చేసుకుంటా' అని రష్మీ అంటే, 'నా గురించి నీకు తెలియదు. పరువు కోసం నేను ప్రాణం ఇవ్వడానికి అయినా తీయడానికి అయినా నేను సిద్ధం' అంటూ నాన్న పాత్ర పోషించిన 'రాకెట్' రాఘవ 'అనడం, ఆ తర్వాత 'నాన్న నిన్ను అర్థం చేసుకుంటారని నేను చాలా ట్రై చేశాను. ఐ యామ్ సారీ నాన్న!' అని చెబుతూ రష్మీ గౌతమ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం చూపించారు. ఇది చూసి లాస్య ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. తాను కూడా ఇలాగే చేశానని చెబుతూ ఓపెన్ అయింది. "నేను అలాగే చేసి వచ్చాను మా నాన్నకు! మా నాన్న గుర్తొచ్చారు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్న లాస్య.. మనల్ని ప్రేమించే వాళ్ళను ఎంత బాధ పెడుతున్నాం అనేది తెలుసుకోం. ఎందుకంటే అప్పుడు కళ్లు మూసుకుపోయి ఉంటాయి కదా.. అప్పుడు ప్రేమలో ఉంటాం కదా! నేను అలాగే చేశాను. ఇప్పుడు రష్మీ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే మా నాన్న గుర్తొచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకుంది లాస్య.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31buMQ2

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts