ఎట్టకేలకు 'అఖండ'కు మోక్షం.. బాలకృష్ణ బరిలోకి దిగేది అప్పుడే! రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ''. నందమూరి నటసింహం హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. చాలాకాలంగా ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు తాజాగా బోయపాటి టీమ్ డిసెంబర్ నెలపై కన్నేసిందని తెలుస్తోంది. బాలయ్య- బోయపాటి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ కావడంతో 'అఖండ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు షూటింగ్ చేస్తూనే ఎప్పటికప్పుడు బోయపాటి రిలీజ్ చేసిన అప్‌డేట్స్ ఆ అంచనాలను రెట్టింపు చేయడమే గాక సినిమాపై ఆతృతను పెంచేశాయి. ఈ నేపథ్యంలో 'అఖండ' దసరా బరిలో ఉంటుందని అంతా భావించారు. కానీ నిరాశే ఎదురైంది. ఆ తర్వాత దీపావళి కానుకగా అయినా రిలీజ్ చేస్తారనుకుంటే అదీ జరగలేదు. ఈ క్రమంలో డిసెంబర్ 2వ తేదీని ఫైనల్‌ చేసే ఆలోచనలో పడిందట బోయపాటి టీమ్. దీనిపై అతి త్వరలో అఫీషియల్ స్టేట్‌మెంట్ రానుందని టాక్. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. మరో ముఖ్యపాత్రలో పూర్ణ కనిపించనుంది. ఇక బాలయ్య బాబు రైతుగా, అఘోరాగా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో అదరగొట్టనున్నారు. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటించాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌కి తోడు అఘోరా ఎపిసోడ్ ఈ మూవీలో హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. తమన్ బాణీలు కట్టిన ఈ చిత్రంపై బాలయ్య ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్స్ ''సింహ, లెజెంట్'' చెంతన 'అఖండ' మూవీ కూడా చేరుతుందని భావిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GSUPf9

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts