NBK 107: బాలకృష్ణతో కుదరదు.. ఇద్దరు స్టార్స్ అదే మాట! సినీ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్

సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తేనే గ్రేట్ అనుకునే ఈ రోజుల్లో లాంటి బడా స్టార్ సినిమాలో ఆఫర్ వచ్చినా సున్నితంగా తిరస్కరించారట ఇద్దరు స్టార్స్. నేటితరం హీరోలతో పోటీపడి సినిమాలు తీస్తున్నారు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోల హవా నేటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కోసం ముఖ్యపాత్రల ఎంపిక జరుగుతోందట. ఈ మూవీలోని హీరోయిన్‌, విలన్‌ రోల్స్ కోసం విజయ్ సేతుపతి, శృతి హాసన్‌లను సంప్రదించగా సీన్ రివర్స్ అయిందనే టాక్ నడుస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్ పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉండాలని భావించిన దర్శకనిర్మాతలు.. తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతిని సంప్రదించారట. కోలీవుడ్‌లో స్టార్ హీరో అయినా విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు యమ అట్రాక్ట్ చేశారు విజయ్ సేతుపతి. కాకపోతే బాలయ్య బాబు సినిమాకు మాత్రం ఆయన 'నో' చెప్పారని తెలుస్తోంది. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. మరోవైపు ఈ సినిమాలో బాలయ్య సరసన నటించబోయే హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఈ మేరకు శృతి హాసన్‌ని తీసుకోవాలని ప్రయత్నించగా ఆమె కూడా కుదరదని సున్నితంగా చెప్పిందట. అయితే బాలయ్య మీద ఉన్న అభిమానంతో గెస్ట్ రోల్ ఏదైనా ఉంటే చేస్తా అని చెప్పిందట. వాస్తవ సంఘటనకి కాస్త కల్పన జోడించి ఈ సినిమా చేస్తున్నట్టుగా గోపీచంద్ మలినేని చెప్పడం అందరిలో ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ చేయాలని చూస్తున్నారట. సో.. చూడాలి మరి అప్పటికల్లా ఏ హీరోయిన్‌ని ఫైనల్ చేస్తారనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y3CdTY

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts