Icon: అల్లు అర్జున్ జోడీ కుదిరింది.. ముచ్చటగా మూడోసారి ఆ హీరోయిన్‌తో! డైరెక్టర్ క్రేజీ ప్లాన్

వెండితెరపై కొన్ని జోడీలకు ఊహించని క్రేజ్ దక్కుతుంటుంది. కెమిస్ట్రీ బాగా పండించిన హీరోహీరోయిన్లను పదే పదే వెండితెరపై చూడాలని కుతూహలంగా ఉంటారు ప్రేక్షకులు. అయితే ఈ డిమాండ్ క్యాచ్ చేస్తూ క్రేజీ కాంబోలను రిపీట్ చేయడానికి దర్శకనిర్మాతల ప్రయత్నాలు జరుగుతుంటాయి. తాజాగా అల్లు అర్జున్- విషయంలో అదే జరుగుతోందట. వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న మరికొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్ళబోతున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డేను కన్ఫర్మ్ చేశారనే టాక్ వినిపిస్తోంది. గతంలో ''DJ: దువ్వాడ జగన్నాథమ్‌, అల.. వైకుంఠపురములో'' సినిమాల్లో జోడీ కట్టి ఆడియన్స్ మెప్పుపొందిన ఈ హిట్ పెయిర్‌ని ముచ్చటగా మూడోసారి వెండితెరపై చూపించాలని ఫిక్సయ్యారాట. ఈ మేరకు పూజాతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, అల్లు అర్జున్‌తో మరో ఛాన్స్ రావడంతో బిజీ షెడ్యూల్‌లో కూడా పూజా హెగ్డే ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఈ న్యూస్ బయటకు రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. హిట్ కాంబో సెట్స్ మీదకొస్తుండటం అనేది 'ఐకాన్' విజయానికి తొలిమెట్టు అని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారని, మరో హీరోయిన్‌గా రష్మిక మందనను ఫైనల్ చేశారని సమాచారం. సో.. చూడాలి మరి దీనిపై అఫీషియల్ స్టేట్‌మెంట్ ఎప్పుడొస్తుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zh0wz5

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts