‘రాజ రాజ చోర’ రివ్యూ.. మెప్పించిన శ్రీ విష్ణు!

హీరో ఎంచుకునే కథలు, చేసే సినిమాల మీద తెలుగు ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉంటాయి. డిఫరెంట్ కథా చిత్రాలకు శ్రీ విష్ణు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు. అలాంటి శ్రీ విష్ణు హీరోగా నేడు (ఆగస్ట్ 19) ‘రాజ రాజ చోర‌’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీపై శ్రీ విష్ణు చేసిన కామెంట్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ఆ అంచనాలు అందుకున్నాయా? నిజంగా ప్యాన్ ఇండియాలో రీమేక్ చేసే సత్తా ఉందా? అనే విషయాలను ఓ సారి చూద్దాం. భాస్క‌ర్‌ (శ్రీ విష్ణు) ఓ జిరాక్స్ షాపులోప‌నిచేస్తుంటాడు. తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని చెప్పి, సంజ‌న‌(మేఘా ఆకాశ్‌)తో ప్రేమలో దించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇక అవసరాల కోసం దొంగతనాలు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలోనే భాస్కర్ అసలు గుట్టు సంజనకు తెలుస్తుంది. భాస్కర్‌కు ఇది వరకు పెళ్లి అయిందని, కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తుంది. అయితే భాస్కర్‌కు పెళ్లి అయితే ఇలా సంజన వెంట ఎంందుకు పడతాడు? ఇంతకీ విద్య (సునైన) ఎవరు? ఇలా అబద్దాలతో శ్రీ విష్ణు ఎందుకు బతుకుతున్నాడు? భాస్కర్ జీవితంలో ఆ ఇద్దరి పాత్ర ఏంటి? ఇక ఈ కథలో విలియం రెడ్డి (రవి బాబు) ఎందుకు వస్తాడు? అతని వల్ల భాస్కర్ జీవితం ఎలా మలుపు తిరిగింది? చివరకు భాస్కర్ కథ ఎలా సుఖాంతం అయింది? వంటి ప్రశ్నలకు సమాధానమే . శ్రీ విష్ణుకు నిజంగానే ఇది కొత్త పాత్ర. ఎప్పుడూ కూడా సైలెంట్‌గా, అమాయకుడిగా, పక్కింటి అబ్బాయిలా కనిపించే పాత్రల్లోనే ఎక్కువగా పోషించారు. అలాంటి శ్రీ విష్ణుకు ఇది కొత్త పాత్రే అవుతుంది. వెంట వెంటనే వేరియేషన్స్ చూపించడం, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్నింట్లోనూ శ్రీ విష్ణు ఇరగ్గొట్టేశారు. అబద్దాలు చెప్పడం, దొంగతనాలు చేయడంతో శ్రీ విష్ణు కామెడీ పండించారు. ఈ కథ మొత్తం కూడా ఎక్కువగా ముగ్గురి చుట్టే తిరుగుతుంది. భాస్కర్, విద్య, సంజన పాత్రల్లో శ్రీ విష్ణు, సునైన, మేఘా కరెక్ట్‌గా సరిపోయారు. హీరోయిన్లలో ఎక్కువగా అంటే సునైనానే మెప్పించినట్టు కనిపిస్తోంది. కాస్త విషయం ఉండి.. సీరియస్ పాత్రలో కనిపించారు. మేఘ తన అందంతో పాటు నటనతోనూ ప్రేక్షకులను కట్టిపడేశారు. పోలీస్ ఆఫీసర్‌గా రవిబాబు విలియం రెడ్డి పాత్రలో అదరగొట్టేశారు. ఇక ఎప్పటిలానే గంగవ్వ తన స్టైల్లో నవ్వులు పూయించారు. కథలోని పాయింట్ కొత్తగానే ఉన్నా కూడా కథనం మాత్రం మామూలుగానే అనిపిస్తుంది. అబద్దాలు అప్పటికప్పుడు ఉపయోగపడినా.. ఎల్లకాలం అవి కాపాడలేవు.. అబ‌ద్దాలు బంధాల‌ను నిల‌ప‌వు అనే పాయింట్‌తో కథను అల్లుకున్నాడు. అయితే ఈ కథలో ఎక్కువ పాత్రలను జొప్పించకుండా ఉన్న వాటితోనే ఎమోషన్, కామెడీ, లవ్ ట్రాక్ ఇలా అన్నింటిని నడిపించేశారు దర్శకుడు హ‌సిత్ గోలి. భార్య, ప్రేయసి ఇలా అందరికీ అబద్దాలు చెబుతూ బతుకుతుంటాడు భాస్కర్. అతడి క్యారెక్టర్‌ను రాసుకున్న తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రథమార్థం మొత్తం కూడా భాస్కర్ దొంగతనాలు, అబద్దాల గోల, పోలీసుల చుట్టూ వ్యవహారం, ప్రేయసితో సీన్లతో నడుస్తుంది. ఇక భాస్కర్ అసలు సంగతి సంజనకు తెలిసే సీన్ కూడా బాగానే ఉంటుంది. అయితే తొలి పది హేను నిమిషాల తరువాతే అసలు కథ పట్టాలెక్కుతుంది. ఇక ద్వితీయార్థం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. సెకండాఫ్‌లో ఎక్కువగా సునైన పాత్ర‌, ర‌విబాబు పాత్ర‌లో కథ నడుస్తుంది. అయితే ప్రతీ సీన్‌లో హీరో కనిపిస్తాడు. కాకపోతే ద్వితీయార్థం ఎక్కువగా సాగదీతగా అనిపిస్తుంది. ఒక అబద్దం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?ఎదుటి వారిని ఎంత బాధపెడుతుందని తెలుసుకున్న మారేందుకు ప్రయత్నించడం ఇలా కథను చక్కగా ముగించేశాడు దర్శకుడు. సినిమా విడుదలకు ముందుగా చెప్పినట్టు మరీ అంత గొప్పగా ఏమీ లేదు. ట్విస్టులు అంత పెద్దగా ఏమీ లేవు.. కాకపోతే ప్రేక్షకుడు మాత్రం ఎక్కడా బోర్ ఫీల్ అవ్వడు. కామెడీ సీన్లతో ప్రేక్షకుడిని అలా థియేటర్లో నవ్విస్తూనే ఉంటారు. అయితే ప్రథమార్థంలో ఉన్న జోష్ మాత్రం సెకండాఫ్‌లో కనిపించదు. సినిమాలోని డైలాగ్స్ మాత్రం ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. పాటలు బాగానే ఉన్నా అంతగా గుర్తుండవు కానీ నేపథ్య సంగీతంతో వివేక్ సాగర్ మ్యాజిక్ చేసేశాడు. వేద రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, విప్ల‌వం నైష‌దం ఎడిటింగ్, సినిమా నిర్మాణ విలువ‌లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. చివరగా : రాజ రాజ చోర.. బాక్సాఫీస్‌పై ప్రభావం చూపగలరా?


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37VSzDC

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts