
జబర్దస్త్ బ్యూటీగా బుల్లితెరపై చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. హాట్ యాంకర్‌గా వారం వారం ఆడియన్స్ మనసు దోచుకుంటూ ఫుల్ ట్రీట్ ఇస్తోంది. రెగ్యులర్ ప్రోగ్రామ్స్‌తో పాటు స్పెషల్ ఈవెంట్స్ చేస్తూ హవా నడిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అటువైపు వెండితెరపై కూడా దూసుకుపోతోంది. 'రంగమ్మత్త' క్యారెక్టర్‌తో ఫుల్ ఫేమ్ సంపాదించి వరుస సినిమా ఆఫర్స్ పట్టేస్తోంది. ఈ నేపథ్యంలోనే అనసూయకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. అనసూయను తమ సినిమాల్లో తీసుకోవడానికి దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నా.. పారితోషికం కంటే పాత్రే ప్రధానం అన్న రీతిలో సెలక్టెడ్ సినిమాలు ఎంచుకుంటోంది ఈ జబర్దస్త్ బ్యూటీ. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ హీరోయిన్ రేంజ్ డిమాండ్ క్రియేట్ చేసుకుంటోంది. కేవలం పారితోషికం కోసం సినిమాలు చేయనని, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా తనకు కావాల్సినంత డబ్బు వస్తోందని చెబుతున్న అనసూయ.. సినిమాల ద్వారా మంచి గుర్తింపు కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నానని అంటోంది. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సైలెంట్‌గా ఓ సినిమాకు సైన్ చేసి చకచకా షూటింగ్ ఫినిష్ చేస్తోందట. ఈ సినిమాలో అనసూయ పాత్రనే హైలెట్ కానుందని అంటున్నారు. ఇది 6 కథల సమ్మేళనం అని, ఆరు కథల్లో అనసూయ కథ హైలైట్ అవుతుందనే విషయం బయటకొచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీలో అనసూయ ఎయిర్ హోస్టెస్‌గా కనిపించనుందట. ఇప్పటికే పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలతో దర్శకుడిగా అందరిని ఆకట్టుకున్న జయశంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని, ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కూడా కంప్లీట్ చేశారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో అనసూయ ఈ సినిమా సెట్స్ మీదకు రానుందని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంది అనసూయ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yjviH0
No comments:
Post a Comment