అనుష్కతో ఫస్ట్ మీట్.. అవి చూడగానే ఓపెన్ కావడంతో ఆమె ఫీలింగ్స్! సీక్రెట్ బయటపెట్టిన విరాాట్

అనుష్క శర్మ- ఈ దిగ్గజాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకరేమో నటించడంలో క్వీన్, మరొకరేమో లైవ్‌లో దూకుడు ప్రదర్శించడంలో కింగ్. అలాంటి ఈ ఇద్దరూ ఒక్కటై ''గా సినీ క్రీడాభిమానుల గుండెల్లో సుస్థిరమైన స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనుష్కతో ఫస్ట్ మీట్ గురించిన సీక్రెట్స్ వెల్లడించి ఆశ్చర్యపర్చారు విరాట్ కోహ్లీ. సాధారణంగానే ప్రేమ పక్షులకు ఫస్ట్ మీట్ అనేది ఓ మెమరబుల్ మూమెంట్. మొట్ట మొదటిసారి ఒకరినొకరు కలుసుకున్న ఆ క్షణాన్ని ప్రేమికులు అస్సలు మరవలేరు. అది ఎప్పటికే స్పెషలే. లవ్ బర్డ్స్ ఎంజాయ్ చేసిన ఆ క్షణం ఓ మధురానుభూతి కూడా. అయితే కొందరి విషయంలో ఫస్ట్ మీట్ చాలా చాలా స్పెషల్‌గా జరుగుతుంటుంది. కొందరి లవ్ గొడవతో స్టార్ట్ అయితే, ఇంకొందరిది కామెంట్లతో స్టార్ట్ అవుతుంది. అయితే విరుష్క విషయంలోనూ ఫస్ట్ మీట్ అనేది ఎప్పటికీ ప్రత్యేకమైనదేనట. ఆ సంఘటనను బయటపెట్టారు విరాట్. తమ మీటింగ్ కాస్త రివర్స్ అటాకింగ్ లోనే మొదలైందని అన్నారు. అందరితో సరదాగా ఉండే తాను.. అనుష్కను మొదటిసారి కలిసినప్పుడు ఆమె హై హీల్స్ చూసి జోక్ చేశానని, ఇంతకంటే.. ఎత్తు చెప్పులు దొరకలేదా? అనేశానని చెప్పారు కోహ్లీ. దీంతో అనుష్క సీరియస్ అయ్యిందని, అంతేకాదు.. తనపై పంచ్ కూడా వేసిందని అన్నారు. నేనేమీ అరడుగులు లేను. అందుకే.. హై హీల్స్ వేసుకున్నాను అని ఆమె అనడంతో షాకయ్యానని తెలిపారు. అలా తమ ఫస్ట్ మీటింగ్ సరదాగా నడిచిందని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు విరాట్. 2017 డిసెంబర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లి, జోడీ.. రీసెంట్‌గా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డకు 'వామిక' అని నామకరణం చేశారు. అయితే తన కూతురును చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనని చెబుతూ ఎమోషనల్ అయ్యారు కోహ్లీ. తమ బిడ్డకు సోషల్ మీడియా అంటే ఏంటో పూర్తిగా తెలిసే వరకూ ఆమెను సోషల్ మీడియాలో ఫోకస్ చేయకూడదని డిసైడ్ అయినట్లు విరాట్ తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CiK6rJ

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts