కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మూతపడ్డ థియేటర్స్ మళ్ళీ తెరుచుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ శుక్రవారం కొత్త సినిమాల హవా కనిపించింది. కరోనా పాండెమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫస్ట్ మూవీగా '' నిలిచింది. ఈ సినిమాకు తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ షో స్లోగానే ఓపెన్ అయినా మౌత్ టాక్ బాగా రావడంతో తర్వాతి షోలు పుంజుకున్నాయి. సినిమాలో నటన, కథపై డైరెక్టర్ గ్రిప్పింగ్ ప్రేక్షకులను ఆకర్షించాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మార్క్ కనిపించిందని అంటున్నారు. ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్కల ప్రకారం 'తిమ్మరుసు' మూవీ తొలి రోజుకు గాను 47 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 27 లక్షల రూపాయల షేర్ వచ్చిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సత్యదేవ్ లాంటి హీరో సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే సినిమాకు మంచి ఆదరణే లభించిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా బిజినెస్ లెక్క మొత్తం మీద 2.4 కోట్ల దాకా ఉండటంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 2.5 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ డే కలెక్షన్స్ తర్వాత చూస్తే మరో 2.30 కోట్ల రేంజ్‌లో షేర్ రాబడితే సేఫ్ అయినట్లు. అయితే ఫస్ట్ డే కన్నా సెకెండ్ డే ఓపెనింగ్స్ బెటర్‌గా ఉన్నాయని తెలుస్తుండటం సినిమాకు బాగా ప్లస్. ఇక మూడో రోజు ఆదివారం కూడా సెలవుదినం కావడంతో ఈ సినిమాకు బెటర్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ 'తిమ్మరుసు' సినిమాను క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. సత్యదేవ్, ప్రియాంక జవల్కర్ ప్రధాన పాత్రలు పోషించగా.. బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించి అలరించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3liAzes
No comments:
Post a Comment