
ఈ సృష్టిలో దేన్నైనా తనదైన కోణంలో మాత్రమే చూసే తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతుంటారు. ఏ విషయంలో నైనా మనసుకు ఏదనిపిస్తే అదే ముక్కుసూటిగా మాట్లాడేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిల అందం గురించి ఆయన చేసే కామెంట్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. చివరకు తనకు పోర్న్ సినిమాలు చూసే అలవాటు కూడా ఉందనే విషయాన్ని బయటపెట్టిన వర్మ తాజాగా స్విమ్ సూట్‌లో తడిసిన అందాలు చూస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో మియా మాల్కోవాతో న్యూడ్ వెబ్ సిరీస్ తీసి వర్మ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. మహిళ శరీరంలో అంగాంగాన్ని వర్ణిస్తూ రచ్చ రచ్చ చేశారు వర్మ. ఆ తర్వాత లాక్‌డౌన్ వేళ పలు సినిమాలతో రొమాంటిక్ ట్రీట్ ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేశారు. ఆ క్రమంలోనే 'థ్రిల్లర్' మూవీతో అప్సర రాణి అందాలను ప్రేక్షకుల ముందుంచారు. అప్పటి నుంచి వర్మ- అప్సర రాణి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. సమయం దొరికినప్పుడల్లా పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరికి సంబంధించిన ప్రతి విషయం ఓ సంచలనం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అప్సర బికినీ లుక్ షేర్ చేస్తూ తనదైన కోణంలో కామెంట్స్ చేశారు వర్మ. తన గోవా ఆఫీసులోని స్విమ్మింగ్ పూల్‌లో బికినీతో అప్సర అలా నడిచి వస్తున్న వీడియోతో పాటు కొన్ని ఫొటోలు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు 'నీ చేతిలో ఉన్న టవల్, టవల్‌లోని పోగులు బాగా నచ్చాయని, దాన్ని ఏ షాపులో కొన్నావు' అని అడుగుతూ అప్సరకు ట్యాగ్ చేశాడు. దీనిపై రియాక్ట్ అయిన అప్సర.. వావ్! రామ్ గారు.. మీరు టవల్‌ను గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉందని తెలుపుతూ 'నేను ఇప్పటి వరకు చూసిన వాటిలో అత్యంత అందమైన ప్రదేశం ఇది. బీచ్ పక్కనే ఉన్న మీ అందమైన గోవా ఆఫీస్‌లో కొంత సమయాన్ని గడపడం చాలా సంతోషం కలిగించింది' అని పేర్కొంది. తిరిగి దీనిపై రియాక్ట్ అయిన వర్మ తన మనసులోని మాట బయటపెట్టేశారు. ''ఇప్పుడు అర్థమైంది అప్సర. నీ ప్రశాంతమైన ఆధ్యాత్మిక స్పర్శతో నా గోవా ఆఫీస్, స్విమ్మింగ్ పూల్ ఎంతో పుణ్యం చేసుకుంది'' అని ఆయన పేర్కొన్నారు. చివరగా రామ్ గారు.. ఆ టవల్ మీ ఆఫీసులోదే అని తెలుపుతూ అసలు మ్యాటర్ చెప్పింది అప్సర. వీరిద్దరి మధ్య జరిగిన ఈ రొమాంటిక్ కన్వర్జేషన్ నెట్టింట వైరల్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37S4pPc
No comments:
Post a Comment